Aaraaa Exit Poll : ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్.. ఏపీలో వైసీపీ.. టీఎస్ లో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..?
Qubetvnews - June 1, 2024 / 08:49 PM IST
Aaraaa Exit Poll : ప్రతి ఎన్నికల సమయంలో ఆరా మస్తాన్ సర్వేకు ప్రత్యేక మైన స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థ చేసిన సర్వే దాదాపు కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ సర్వే సంస్థ ప్రకటించే ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆరాన్ మస్తాన్ సర్వే సంస్థ ఫలితాలను ప్రకటించింది. ఏపీతో పాటు తెలంగాణ ఫలితాలను కూడా ఇందులో వెల్లడించారు. ఇందులో చూసుకుంటే ఏపీలో వైసీపీ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఈ సంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఇందులో చూసుకుంటే వైసీపీకి క్లియర్ మెజార్టీ వస్తుందని తేల్చి చెప్పింది.
వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని ఈ సంస్థ తెలిపింది. క్లియర్ కట్ మెజార్టీతో జగన్ సీఎం అవుతాడని ఈ సర్వే ప్రకటించింది. ఇక అటు టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇక ఓటింగ్ షేర్ చూస్తే వైసీపీకి 49 శాతం ఓటింగ్ నమోదు కానున్నట్టు తెలిపింది ఈ సర్వే. ఇందులో ఎక్కువగా ఫీమేల్ ఓట్లే వైసీపీకి పడ్డాయని చెబుతున్నారు. అటు టీడీపీ కూటమికి మాత్రం 47 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు చెబుతున్నారు. ఇక ఎంపీ సీట్ల విషయంలో కూడా వైసీపీకి తిరుగులేదని ఈ సర్వే తెలిపింది. ఇందులో చూసుకుంటే వైసీపీకి 13 నుంచి 15 సీట్లు వస్తాయని స్పష్టం చేసింది.
టీడీపీ కూటమికి మాత్రం కేవలం 10 నుంచి 12 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. ఇందులో చూసుకుంటే ఎంపీ ఎన్నికల్లో వైసీపీకి 48 శాతం ఓటింగ్ పడిందని.. కానీ టీడీపీ కూటమికి మాత్రం కేవలం 47 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైనట్టు చెబుతున్నారు. ఈ రకంగా మొత్తానికి ఏపీలో వైసీపీ పార్టీకి తిరుగులేదని చెబుతున్నారు. ఇక టీడీపీ కూటమికి ఈ ఎగ్జిట్ పోల్ లో షాక్ తగిలింది. ఇక ఇటు తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ను కూడా ఈ సంస్థ స్పష్టం చేసింది. అయితే ఇందులో భిన్నమైన ఫలితాలు అందరికీ షాక్ కలిగించాయి. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ కనిపించింది.
తెలంగాణలో బీజేపీ హవా సాగుతుందని ఈ ఎగ్జిట్ పోల్ సర్వే స్పష్టం చేసింది. ఇందులో చూసుకుంటే బీజేపీకి 8 నుంచి 9 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ సారి 7 నుంచి 8 సీట్లు వస్తాయని తెలిపింది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తప్పదని తెలిపింది.
ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన బీఆర్ ఎస్ పార్టీకి ఘోరమైన ఫలితాలు దక్కాయి. తెలంగాణలో బీఆర్ ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని ఈ సంస్థ సర్వేలో తేలింది. దాంతో బీఆర్ ఎస్ కు షాక్ తగిలింది. ప్రధానంగా జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఈ సారి టఫ్ ఫైట్ నడిచినట్టు ఈ సంస్థ వెల్లడించింది.





