Allu Arjun : వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు.. రగిలిపోతున్న జనసేన..!

Qubetvnews - May 11, 2024 / 04:26 PM IST

Allu Arjun : వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు.. రగిలిపోతున్న జనసేన..!

Allu Arjun : ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఓ వైపు పోలింగ్ దగ్గరపడుతోంది. ఇంకోవైపు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ఒకరిపై ఒకరు నిప్పులు కురిపించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా మరో వివాదం రాజుకుంది. అదే మెగా వర్సెస్ అల్లు వార్. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ కు అల్లుఫ్యాన్స్ కు మధ్య పెద్ద వారే నడుస్తోంది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ పై మెగా హీరోలు ప్రవర్తిస్తున్న తీరు.. అటు మెగా మేనియాపై అల్లు అర్జున్ స్పందిస్తున్న తీరు ఇప్పటికే వివాదాస్పదం అవుతోంది. అయితే తాజాగా అల్లుఅర్జున్ చేసిన పని మరింత అగ్గి రాజేసింది.

తాజాగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్వా రవి ఇంటికి చేరుకున్నారు. శిల్పా రవి ఇప్పుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అయితే ఆయనకు మద్దతు తెలపడం కోసం బన్నీ ఈరోజు నంద్యాలకు తన భార్య స్నేహారెడ్డితో కలిసి చేరుకున్నారు. వారికి శిల్పా దంపతులు స్వాగతం పలికారు. ఈ క్రమంలో బన్నీని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తన ఫ్రెండ్ అడగకపోయినా తన బాధ్యతగా భావించి ఆయనకు మద్దతు తెలపడం కోసం వచ్చానన్నారు.

ఈ ఎన్నికల్లో రవి చంద్రారెడ్డిని గెలిపించాలని కోరారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇప్పుడు జనసైనికులు ఈ విషయంపై రగిలిపోతున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ సపోర్టుతో ఎదిగిన బన్నీకి ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కనిపించట్లేదా అని అడుగుతున్నారు. పవన్ కల్యాణ్‌ కోసం బన్నీ మొన్న కేవలం ఒక ట్వీట్ పెట్టి వదిలేశాడు. కానీ ఇప్పుడు పవన్ ను ఓడించాలని చూస్తున్న వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కోసం నేరుగా ఇంటికి వెళ్లాడని వారు వాదిస్తున్నారు. అటుమెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్‌ తేజ్ లాంటి వారు వచ్చి పవన్ కల్యాణ్ తరఫున ప్రచారం చేస్తున్నారు.

కానీ బన్నీ మాత్రం పవన్ కల్యాణ్‌ తరఫున ప్రచారానికి రాకపోవడం ఏంటని మండిపడుతున్నారు. బన్నీకి విశ్వాసం లేదంటూ మరోసారి జనసైనికులు, అటు పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. అయితే ఈ విమర్శలకు బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే రిప్లై ఇస్తున్నారు. అల్లు అర్జున్ కేవలం స్నేహితుడి కోసమే వెళ్లాడని చెబుతున్నారు.

అంతే తప్ప ఆయనకు ఏ పార్టీలతోనూ సంబంధాలు లేవని.. కేవలం స్నేహానికి విలువ ఇచ్చి మాత్రమే వెళ్లాడని అంటున్నారు. ఏదేమైనా బన్నీ ఇలా వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడం అంటే ఎంతో కొంత వైసీపీకి పాజిటివ్ నెస్ పెరగడమే అంటున్నారు రాజీకయ విశ్లేషకులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News