AV Subba Reddy : ఆప్నా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి..!

Qubetvnews - March 7, 2024 / 09:43 AM IST

AV Subba Reddy : ఆప్నా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి..!

AV Subba Reddy : ఏపీ ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడలో జరిగిన సంఘం కార్యవర్గ సమావేశంలో సభ్యులు అందరూ కలిసి సుబ్బారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కొత్త కమిటీని కూడా నియమించుకున్నారు.

ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న నర్సింగ్ హోమ్స్ డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అంతే కాకుండా నర్సింగ్ హోమ్స్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి.

ఆయన ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడిగా, రాష్ట్ర ఐఎంఏ సంయుక్త కార్యాదర్శిగా కూడా సేవలందించారు. అంతే కాకుండా ఆయన గతంలో కూడా అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించారు. దాంతో పాటు ప్రైవేట్, గవర్నమెంట్ వైద్య విద్యార్థుల సమస్యలపై కూడా బాగానే పోరాడారు. ఆయన సేవలను గుర్తించిన సంఘం నేడు ఆయన్ను నర్సింగ్ హోమ్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News