Botsa Jhansi : ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యం.. విశాఖలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం..!

Qubetvnews - April 18, 2024 / 01:04 PM IST

Botsa Jhansi : ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యం.. విశాఖలో ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం..!

Botsa Jhansi : ఏపీ అభివృద్ధి జరగాలంటే జగన్ సీఎం కావాలని.. ఆయనతోనే అది సాధ్యం అని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. గురువారం తెల్లవారు జామున విశాఖబీచ్ లో వాకర్స్ ను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విశాఖ బీచ్ లో వాకర్స్ కోసం అవసరం అయిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అయితే ఆమె ప్రతి ఒక్కరితో ఆప్యాయం మాట్లాడుతూ ముందుకు వెళ్లారు. చిన్న పిల్లలు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మాట్లాడారు. తనకు ఓటేసి గెలపించాలని కోరారు.

Botsa Jhansi campaign in vishaka beach

Botsa Jhansi campaign in vishaka beach

మరోసారి జగన్ ను సీఎం చేస్తేనే అన్ని విధాలుగా ఏపీ అభివృద్ధి అవుతుందని తెలిపారు. ఉత్తరాంధ్రకు ఎక్కువ నిధులు రావాలన్నా జగన్ తోనే సాధ్యం అని వివరించారు. అయితే ఆమెకు ప్రచారంలో భాగంగా కొందరు ఎయిర్ పోర్టు సమీపంలో ఉన్నట్లుగా పెద్ద జాతీయ పతాకాన్ని నెలకొల్పాలని సూచించచారు. దానికి ఝాన్సీకూడా వెంటనే మద్దతు తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచన మంచిదే అని వివరించారు. ఎంపిగా ఎన్నికయ్యాక ఈ అంశంలో చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా తనకు ఆంధ్రా యూనివర్సిటీతో ఉన్న సంబంధాన్ని అక్కడి వారికి వివరించారు.

Botsa Jhansi campaign in vishaka beach

Botsa Jhansi campaign in vishaka beach

 

అక్కడ కొందరిని కలిసి జగన్ ప్రవేశ పెట్టిన పథకాల లబ్ధి జరుగుతోందా అని ప్రశ్నించారు. వారు కూడా పథకాలతో ఎంతో లబ్ది పొందుతున్నట్టు తెలిపారు. వాకింగ్ చేస్తూ కాసేపు సేద తీరుతున్న వృద్ధులకు తనను పరిచయం చేసుకుని, రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి ఉన్న తేడాను గుర్తించాలంటూ కోరారు. సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన వివరించారు. వచ్చిన ఉత్తరభారత ప్రాంత ప్రజలతోనూ కలగలుపుగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో విశాఖలో జరిగిన అభివృద్ధిని వివరించి, ప్రభుత్వానికి మద్ధతు పలకాలంటూ వినమ్ర పూర్వకంగా అభ్యర్ధించారు.

Botsa Jhansi campaign in vishaka beach

Botsa Jhansi campaign in vishaka beach

ఆ తర్వాత మార్నింగ్ వాక్ర్స్ కు ఆహార పదార్థాలను అమ్ముకుంటూ అక్కడే బతుకుతున్నబంగరాజు అనే చిరు వ్యాపారితో ఆమె మాట్లాడారు. అక్కడి రాగి మాల్ట్ ను స్వయంగా రుచి చూడటమే కాకుండా, అక్కడున్న మిల్లెట్స్, తులసి టీ తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

 

బంగరాజు కూడా తనకు జగన్ పథకాలతో ఎంతో లబ్ది జరుగుతోందని తెలిపాడు. దాంతో అతన్ని మరోసారి జగన్ కుఓటేయాలని ఝాన్సీ కోరగా తప్పకుండా వేస్తానని తెలిపారు. ఇలా అందరితో కలుపుగోలుగా మాట్లాడుకుంటూ ఆమె ముందుకు కదిలారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News