Chandrababu : సీనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రభక్తి ఇంతేనా.. అవసరానికే గుర్తుకొస్తారా..?

Qubetvnews - May 29, 2024 / 10:18 AM IST

Chandrababu : సీనియర్ ఎన్టీఆర్ పట్ల చంద్రభక్తి ఇంతేనా.. అవసరానికే గుర్తుకొస్తారా..?

Chandrababu : సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక గర్వకారణం. అయితే తెలుగు ప్రజలకు ఆయన ఎంత చేశాడనేది ఎంతచెప్పినా తక్కువే అవుతుంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడుకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిగా చెప్పుకోవాలి. ఓడిపోయిన వ్యక్తికి రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తే చివరకు ఎన్టీఆర్ పార్టీనే లాక్కున్న ఘనత కేవలం చంద్రబాబుకు మాత్రమే దక్కిందని చెప్పుకోవాలి. చంద్రబాబును అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఎన్ని తిట్లు తిట్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటిది సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు గుర్తుంచుకునేది మాత్రం ఆయనకు అవసరం ఉన్నప్పుడే అని అంటున్నారు.

ఏదైనా పార్టీ సభ పెట్టినప్పుడు ఆయన విగ్రహానికి లేదా ఫొటోకు ఒక దండ వేయడం, ఆయన జయంతి నాడు మహానాడు నిర్వహించడం తప్ప ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. చంద్రబాబు ఎన్నడూ తన స్పీచ్ లో కనీసం సీనియర్ ఎన్టీఆర్ ను స్మరించుకున్నది కూడా లేదు. ఇక ఏపీలో పోలింగ్ ముగిసిన వెంటనే చంద్రబాబు తన ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఏపీ రాజకీయాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉన్నారు. కానీ పోలింగ్ గురించి మాట్లాడట్లేదు. ఇక ఈ సారి సీనియర్ ఎన్టీఆర్ జయంతి కూడా వచ్చింది. కానీ దాన్ని మాత్రం సెలబ్రేట్ చేయలేదు.

చంద్రబాబు ఇప్పుడు అమెరికాలో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన, పిల్లనిచ్చిన మామ సీనియర్ ఎన్టీఆర్ ను ఎందుకు స్మరించుకోవట్లేదని అంతా అడుగుతున్నారు. ఇక చంద్రబాబు అమెరికా నుంచి బుధవారం వస్తారని తెలుస్తోంది. అదే చంద్రబాబు ఒక్క రోజు ముందు వచ్చినట్టు ఉంటే సీనియర్ ఎన్టీఆర్ జయంతి వేడుకలను నిర్వహించి ఉంటే బాగుండేది కదా అని పార్టీ శ్రేణులు కూడా అడుగుతున్నారు. చంద్రబాబు ఒక్క రోజు ముందు రావడానికి ఎందుకంత ఇబ్బందిగా ఆలోచించారని అడుగుతున్నారు.

సీనియర్ ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఇంతేనా అని అడుగుతున్నారు. చంద్రబాబు తన అవసరానికే సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జయంతిని ముందే నిర్వహించుకుంటే ఎన్నికల ఫలితాల ముందు నవ్వుతారాని అనుకున్నారా అని అడుగుతున్నారు.

ఒకవేళ ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా లేకపోతే జయంతిలో ఏం మాట్లాడినా పరువు పోతుందని భావించారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు కేవలం తన అవసరానికే గుర్తుకుంచుకుంటాడని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News