Chandrababu : వచ్చీ రాగానే మొదలెట్టేసిన చంద్రబాబు.. వైసీపీ మీద బురదజల్లేందుకు రెడీ..!
Qubetvnews - May 30, 2024 / 04:38 PM IST
Chandrababu : చంద్రబాబు నాయుడు లేని పది రోజుల ఏపీ రాజకీయాలు ఊహించడానికి కూడా ఒక రకంగా ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఎందుకంటే చంద్రబాబు ఇన్ని రోజులు లేకుండా పోవడం వల్ల టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు కొత్త స్క్రిప్లులు లేకుండా పోయాయి. అందుకే వారంతా ఇంకా మాచర్ల ఘటనను పట్టుకుని దానికే రకరకాల రంగులు అద్దుతున్నారు. ఇక ఇన్ని రోజులు చంద్రబాబు విదేశాల్లో విహార యాత్రను పూర్తి చేసుకుని తాజాగా ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా వచ్చీ రాగానే మళ్లీ తన మాయ రాజకీయాలు మొదలెట్టేశారు.
రాగానే ఆయన టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. జూన్ 1వ తేదీన కౌంటింగ్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వాలంటూ తెలిపారు. అయితే కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడవచ్చు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఇక్కడ విడ్డూరం. చంద్రబాబు ఆవేదన ఏంటంటే ఇక్కడ ఏదో ఒక విధంగా వైసీపీ మీద బురద జల్లడం మొదలెట్టాలి. ఇందులో భాగంగానే ఆయన ఇలా మాట్లాడారని అంటున్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ నుంచే టీడీపీ రాజకీయ రచ్చ మొదలవుతోందని అంటున్నారు.
ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో చాలా దొంగ ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. సీల్ స్టాంప్ లేకపోయినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి సంతకం ఉంటే చాలు వాటిని లెక్కించొచ్చు అంటూ ఆదేశాలు తెచ్చుకున్నారు చంద్రబాబు. అయితే దానిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా వాటి లెక్కింపు తమకు చాలా ముఖ్యం అని చంద్రబాబు భావిస్తున్నారు. అవి పెద్దగా ప్రభావం చూపించక ఒకవేళ టీడీపీ కూటమి గనక ఓడిపోతే కౌంటింగ్ రోజున వైసీపీ అక్రమాలకు పాల్పడి గెలిచింది అంటూ ఆరోపణలు చేయడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు చంద్రబాబు.
అందుకే వైసీపీ ఏజెంట్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇది ఒక రకంగా చూస్తుంటే తన కార్యకర్తలకు సూచించినట్టు లేదు.. కౌంటింగ్ రోజున వైసీపీ వాళ్లు అక్రమాలకు పాల్పడుతారు కాబట్టి మీరు కూడా రెచ్చిపోండి అని ఉసిగొల్పినట్టే ఉందంటున్నారు.
అంటే కౌంటింగ్ రోజున కచ్చితంగా గొడవలు జరిగే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఈ రకమైన రాజకీయాలు ఎన్నడూ చూడని విధంగా ఉండాలని చంద్రబాబు ప్లాన్ వేసుకుంటున్నట్టు చెబుతున్నారు. మరి చంద్రబాబు ఇప్పటి నుంచే ఇలాంటి ప్లాన్లు వేస్తుంటే కౌంటింగ్ రోజున ఎలా ఉంటుందో చూడాలి.





