Tdp-Ysrcp : ఆ గట్టున సినిమా స్టార్ల హంగామా.. ఈ గట్టును రియల్ స్టార్ల ప్రచారం..!

Qubetvnews - May 9, 2024 / 04:48 PM IST

Tdp-Ysrcp : ఆ గట్టున సినిమా స్టార్ల హంగామా.. ఈ గట్టును రియల్ స్టార్ల ప్రచారం..!

Tdp-Ysrcp : ఏపీలో రాజకీయం స్టార్ల చుట్టూ తిరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కట్టగట్టుకుని మరీ జగన్ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు టీడీపీ కూటమి బీజేపీ, జనసేనతో కలిసి వస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి వస్తోంది. కానీ ఇటు వైసీపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగుతోంది. వాస్తవానికి వైసీపీని ఏ ఒక్క పార్టీ కూడా సింగిల్ గా వచ్చి ఢీకొట్టే పరిస్థితి లేదు. అందుకే ఇలా కట్టగట్టుకుని గుంపులుగా వస్తున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి తరఫున చాలా పెద్ద సినిమా స్టార్లు వస్తూ ప్రచారం చేస్తున్నారు.

అందులో చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ చాలా పెద్ద సినిమా స్టార్. ఆయన ఓ వైపు పిఠాపురంలో ప్రచారం చేసుకుంటూనే మిగతా నియోజకవర్గాల్లో కూడా తిరుగుతున్నారు. అటు వైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీరిద్దరూ చాలా పెద్ద సినిమా స్టార్లే. ఇక పవన్ కల్యాణ్‌ కోసం మొన్నటి వరకు జబర్దస్త్ టీమ్ మొత్తం వచ్చి పిఠాపురంలో ప్రచారం చేసింది. పవన్ కల్యాణ్‌ కు ఓటేయాలంటూ అడిగారు. ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు.

టీడీపీ కూటమికి ఓటేయాలంటూ వారంతా కోరుతున్నారు. అటు వైపు మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ ను గెలిపించాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఇలా సినిమాస్టార్లు అందరూ కలిసి టీడీపీ కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు. కానీ ఇటు వైసీపీ తరఫున మాత్రం జగన్ అంతా తానై చూసుకుంటున్నారు. ఆయన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయనకు అండగా ఉన్నది మాత్రంరియల్ స్టార్లే అని చెప్పుకోవాలి. అంటే జగన్ పాలనలో లబ్ది పొందిన వారే ఇప్పుడు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ పాలనలో పింఛన్ కోసం విసిగిపోయిన ఓ తాత, అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క… జగనన్న విద్యా కనుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి… ఆసరా అనుకున్న ఓ అక్క… ఇలా పేదలే జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీకు మరోసారి లబ్ది జరగాలంటే మాత్రం జగన్ కు ఓటేయాలంటూ కోరుతున్నారు.

ఇప్పటికే వాలంటీర్లు సైతం తమ జాబులకు రాజీనామాలు చేసి మరీ జగన్ ను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారం చేసి జగన్ కు ఓటేయాలని కోరుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేనందుకు పని చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News