Lokesh : లోకేష్ గెలుపుపై టీడీపీలో అనుమానాలు.. అందుకే వాటికి దూరం..?

Qubetvnews - May 19, 2024 / 03:56 PM IST

Lokesh : లోకేష్ గెలుపుపై టీడీపీలో అనుమానాలు.. అందుకే వాటికి దూరం..?

Lokesh : ఏపీలో రాజకీయాలు ఉన్నట్టు ఇంకా ఎక్కడ కూడా ఉండవనే చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయాలకు అంతప్రాధాన్యం ఇస్తుంటారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి మొదలు పెడితే కింది స్థాయి కార్యకర్తల వరకు అందరూ ఢీ అంటే ఢీ అన్నట్టే రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. అందుకే ఏపీ రాజకీయాలపై దేశ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు ఆసక్తి ఉంటుంది అందరికి. ఇక ఇప్పుడు ఏపీలో పోలింగ్ పూర్తయింది. అభ్యర్థుల రాజకీయ భవిష్యత్ బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. అయితే ఇప్పుడు ఫలితాలపై రకరకాల బెట్టింగ్ లు ఏపీలో సాగుతున్నాయి.

ఇప్పటికే పలు బెట్టింగ్ సంస్థలు రకరకాల అభ్యర్థులపై బెట్టింగ్ లు కాస్తున్నాయి. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ గెలుస్తాడా, కడపలో షర్మిలకు వచ్చే ఓట్లు ఎన్ని, ఏపీలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్ కు వచ్చే మెజార్టీ ఎంత ఇలాంటి వాటిపై బెట్టింగ్ లు కాస్తున్నారు. అయితే ఇందులో అందరికంటే ఎక్కువగా లోకేష్ మీదనే బెట్టింగ్ లు సాగుతున్నాయి. మంగళగిరిలో లోకేష్ గెలుపుపైనే బెట్టింగ్ సంస్థలు ఎక్కువగా అమౌంట్ ఆఫర్లు చేస్తున్నాయి. లోకేష్ గెలుస్తాడు అని బెట్టింగ్ కాసే వారికి ఎక్కువ డబ్బులు ఆఫర్లు చేస్తున్నాయి.

వాస్తవానికి బెట్టింగ్ సంస్థలు ఎప్పుడైనా సరే తమకు ముందే ఇన్ఫర్మేషన్ ఉండి ఓడిపోయే అభ్యర్థి గెలుపుపైనే ఎక్కువగా ఆఫర్లు చేస్తుంటాయి. ఇప్పుడు లోకేష్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఆయన గెలుపుపైనే ఎక్కువగా ఆఫర్లు పెడుతున్నారు బెట్టింగ్ రాయుళ్లు. దాంతో లోకేష్ గెలుపుపై బెట్టింగ్ కాసేందుకు ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే టీడీపీ కేడర్ కూడా లోకేష్ గెలుపుపై బెట్టింగ్ కాయడానికి వెనకడుగు వేస్తోంది. ఎందుకంటే వారికి కూడా తెలుసు.. లోకేష్ ఓడిపోతాడని అందుకే బెట్టింగ్ కాసేందుకు భయపడుతున్నారు.

అదే జగన్ మీద మాత్రం ఆయన మెజార్టీపై బెట్టింగ్ కాసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. జగన్ కు లక్షకు పైగానే మెజార్టీ వస్తుందని బెట్టింగ్ కాసేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై బెట్టింగ్ రాయుళ్లు ఇలా ప్రవర్తించడంతో లోకేష్ ఓటమి ఇక్కడే ఖాయం అయిపోతోంది.

దీన్ని బట్టి లోకేష్ గెలుపు మీద టీడీపలో ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతోందని అంటున్నారు. అయితే కొందరు మాత్రం లోకేష్ గెలిచే అవకాశాలు ఉన్నాయని వాదిస్తున్నా టీడీపీలో దానిపై పెద్దగా నమ్మకం లేనట్టే కనిపిస్తోంది. చూడాలి మరి జూన్ 4న ఎలాంటి ఫలితాలు వెలువడుతాయి అనేది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News