Ys Jagan : సంక్షేమ పథకాలే ఓటింగ్ ను నిలిపాయా.. వైసీపీకి లాభమేనా..?

Qubetvnews - May 14, 2024 / 12:21 PM IST

Ys Jagan : సంక్షేమ పథకాలే ఓటింగ్ ను నిలిపాయా.. వైసీపీకి లాభమేనా..?

Ys Jagan : మొత్తానికి ఎన్నో ప్రచారాల తర్వాత పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు జరిగాయి గానీ.. మొత్తానికి అయితే ప్రశాంతంగానే సాగిపోయింది. కాగా పోలింగ్ రోజున జరిగిన కొన్ని ఘటనలు ఇటు అధికార పక్షాన్ని.. అటు విపక్షాన్ని కాస్త ఊగిసలాడేలా చేశాయి. కానీ ఎటొచ్చి పోలింగ్ శాతం మీదనే అందరి అంచనాలు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈ సారి పోలింగ్ పెరుగుతుందని అంతా అనుకున్నారు. వాస్తవానికి ఉదయం పూట ఈ సారి పోలింగ్ విపరీతంగా నమోదైంది. ఎందుకంటే ఈ సారి ఎండలు దండికొడుతున్నాయి కాబట్టి.. ఉదయం పూటనే ఎక్కువ మంది ఓటేసేందుకు ఎగబడ్డారు.

దాంతో పోలింగ్ బూత్ లు కిటకిటలాడాయి. ఉదయం పూటనే దాదాపు 40 శాతం ఓటింగ్ పూర్తి అయింది. ఉదయం 10 గంటల వరకే ఈ స్థాయిలో నమోదు కావడంతో ఈ సారి కనీసం 80 శాతానికి పైగా నమోదవుతుందని అంతా అంచనాలు వేశారు. కానీ అంతగా జరగలేదు. ఎందుకంటే మధ్యాహ్నం 1 గంట తర్వాత పోలింగ్ బూత్ లు వెలవెలబోయాయి. ఎక్కడా జనాలు కనిపించలేదు. దాంతో చివరకు 68 శాతం ఓటింగ్ నమోదయిందని ప్రాథమిక అంచనాలు తెలిపాయి. అయితే ఈ ఓటింగ్ అయినా జరగడానికి జగన్ సంక్షేమ పథకాలే కారణం అని అంటున్నారు.

ఎందుకంటే ఈ సారి రూరల్ ఏరియాలోనే ఎక్కువ పోలింగ్ నమోదైంది. దాంతో వారంతా జగన్ కే ఓటేశారని అనుకుంటున్నారు. ఈ సారి పోలింగ్ చాలా తక్కువ నమోదవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో తెలియదు గానీ.. ఈ సారి ఈ మాత్రం నమోదవడానికి కారణం జగన్ పెట్టిన సంక్షేమ పథకాలే కారణం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు జగన్ వల్ల ఎక్కువగా లబ్ది జరిగింది. దాంతో వారంతా లాభం జరిగింది.. డబ్బులు పథకాల ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి కచ్చితంగా ఓటేయాలని వారు భావించారు.

అంటే ఆ రుణాన్ని తీర్చుకోవాలని వారు భావించారు. అందుకే జగన్ వైపే వారంతా మొగ్గుచూపినట్టు చెబుతున్నారు. చాలా మంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇదే బాటలో సాగుతున్నారు. దాంతో వారంతా ఈ సారి జగన్ కే ఓటేశారని వైసీపీ నేతలు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎందుకంటే ఎక్కువ పోలింగ్ నమోదైతే అది ప్రతిపక్షాలకు లాభం జరుగుతుందని అంచనా వేస్తుంటారు. కానీ ఈ సారి పెద్దగా పోలింగ్ నమోదు కాలేదు కాబట్టి ఇది జగన్ ను మరోసారి సీఎం సీటులో కూర్చోబెట్టడం ఖాయం అని అంటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News