Janasena : ఇదే సరైన సమయం.. ఆ జిల్లాల్లో బలపడేందుకు జనసేన ప్లాన్..?
Qubetvnews - July 30, 2024 / 08:15 PM IST
Janasena : జనసేన పార్టీ ఇంకా బలంగా తయారు కాలేదు. చాలా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో సరైన లీడర్లే లేరు. ఇప్పుడు ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీలోకి చాలా మంది వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే టీడీపీలో ఫుల్ అయిపోయింది. కాబట్టి వైసీపీలోని లీడర్లు పార్టీ మారాలి అనుకుంటే వారికి ఇప్పుడు జనసేన బెటర్ ఛాయిస్ లా ఉంది. ఎందుకంటే ఇప్పటి నుంచే కష్టపడితే పార్టీ ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి ఏదో ఒక పదవి ఖాయం. అంతే కాకుండా రాబోయే రోజుల్లో పార్టీలోనే రాష్ట్ర స్థాయి లీడర్ కూడా కావొచ్చని చాలా మంది ఆలోచిస్తున్నారు.
అందుకే ఇప్పుడు వైసీపీకి చెందిన ఉభయ గోదావరి జిల్లాల లీడర్లు, అలాగేఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయవాడ కృష్ణా లాంటి జిల్లాల్లో బలపడేందుకు జనసేన ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే సభ్యత్వ నమోదును మరో వారం రోజులకు పెంచారు. ఈ క్రమంలోనే స్థానిక ఎన్నికలు వచ్చేలోపే జనసేనలోకి వైసీపీ నుంచి బలమైన లీడర్లను తీసుకోవాలని భావిస్తున్నారంట పవన్ కల్యాణ్. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన తనయుడు పిల్లి సూర్యప్రకాశ్, తదితరులు ఈ కోవలో ఉన్నారని చెబుతున్నారు.
పెండెం దొరబాబు కూడా పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. ఇక వంగా గీత కూడా త్వరలోనే జనసేనలోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. పైగా ఇప్పుడు పవన్ కల్యాణ్ గ్రామీణఅభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి.. గ్రామాల్లో పార్టీని బలంగా మార్చుకునేందుకు ప్లాన్లు వేస్తున్నారంట పవన్ కల్యాణ్. ఇందులో భాగంగానే తమ పార్టీలోకి వచ్చే లీడర్లకు పెద్ద పీట వేస్తామని.. సెకండ్ గ్రేడ్ నాయకులు వస్తే వారికి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచుల పదవులు వచ్చేల కృషి చేసి.. భారీగా నిధులు కూడా కేటాయిస్తామని హింట్ ఇస్తున్నారంట.
దాంతో చాలా మంది లీడర్లు తమ వెంట నడిచే సెకండ్ గ్రేడ్ లీడర్లతో కలిసి జనసేనలోకి వెళ్లేందుకు ప్లాన్ వేసుకుంటున్నారని సమాచారం. అలా చేస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే టికెట్లు ఖాయం అని ఆశిస్తున్నారు. జనసేనకు చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి లీడర్లు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ఆ స్థానాలను భర్తీ చేసేందుకు బలమైన లీడర్లను తీసుకుంటున్నారంట పవన్ కల్యాణ్. ఇంకొన్ని రోజులు గడిస్తే ప్రభుత్వం మీద అంచనాలు ప్రజల్లో తగ్గుతాయి. అప్పుడు ప్రభుత్వం మీద హైప్ కూడా తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడున్న హైప్ లోనే లీడర్లను చేర్చుకోవడానికి ప్లాన్లు వేసుకుంటున్నారు.





