Nara Chandrababu Naidu : అధికారమే కావాలి… అందుకోసం ఏమైనా చేయాలి..ఇదే బాబుగారి నైజం..
Qubetvnews - February 17, 2024 / 08:44 AM IST
Nara Chandrababu Naidu :
త్వరలో జరుగనున్న ఎన్నికల పోరు రసవత్తరంగా ఉండనుంది. ఏ పార్టీలు పొత్తుకు ఉంటాయో.. ఏవి సింగిల్ గా పోటీ చేస్తాయో అర్థం అవడం లేదు. బహుశా 2014 నాటి పొత్తులు పునరావృతమైతే ఆప్పటి ఫలితాలే పునరావృతమవుతాయని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకే 2019 ఎన్నికలకు ముందు తీవ్ర విమర్శలు చేసిన భారతీయ జనతా పార్టీతో మరోసారి కలిసేందుకు ఢిల్లీకి వెళ్లి చర్చలు మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ ద్వారా మూడు పార్టీల పొత్తులకు రాయబారులుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఎట్టకేలకు స్వయంగా రంగంలోకి దిగారు. తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఎవరూ ఎలాంటి ప్రకటన చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. వీరి భేటీ బుధవారం రాత్రి 11.30 గంటలకు జరగడం గమనార్హం.
అయితే భారతీయ జనతా పార్టీతో పొత్తుపై రాష్ట్రంలోని తెలుగుదేశం శ్రేణుల్లో పలు భయాందోళనలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను నానా తిట్లు తిట్టిన పార్టీనే మనసు మార్చుకుని కేవలం ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్న కసితోనే.. చంద్రబాబు నాయుడు మళ్లీ తనను అవమానించిన పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని భయపడుతున్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీ మోసం చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేసి.. పెద్ద ధర్మయుద్ధం చేసి.. ఇప్పుడు మళ్లీ వెళ్లి మోడీ కూటమిలో చేరడం అంటే ప్రత్యేక హోదాకు చరమగీతం పాడాడన్న ఒపీనియన్ కు ప్రజలు వస్తారనే భయం కూడా ప్రజల్లో నెలకొంది.
రామమందిరం తెరవడం వల్ల దేశంలో మోడీ వేవ్ పెరిగిపోయిందన్నది చంద్రబాబు నమ్మకం. అదే సమయంలో ముస్లిం వర్గాల్లో మోడీపై ద్వేషం, భారతీయ జనతా పార్టీపై ఆగ్రహం కూడా పెరిగిపోయిందని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే మోడీ వేవ్ ఉన్నంత మాత్రానా భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఓట్లు పడటం కష్టమే. పవన్ కళ్యాణ్ కూడా వివిధ కారణాల వల్ల బీజేపీతో పొత్తు కోసం చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము చంద్రబాబు నాయుడుకు లేదు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల అభ్యర్థులు, నేతల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక కారణాన బీజేపీతో పొత్తుకు చంద్రబాబునాయుడు ఎగబడి వెళుతున్నారు సరే.. కానీ.. ఇంత ఆలస్యం గానా? అనేది పార్టీ నాయకుల ఆగ్రహానికి కారణం అవుతోంది.
జనసేనతో పొత్తు పెట్టుకుంటే వచ్చే స్థానాలపై నిర్ణయం తీసుకోకుండా కార్యకర్తలకు క్లారిటీ ఇవ్వకపోవడంతోనే ప్రచారంలో వెనుకబడిపోయామని భయపడుతున్నారు. బీజేపీతో చర్చల టైమింగ్ దెబ్బతింటుందని భావిస్తున్నారు. ఇంత ఆలస్యంగా చర్చలు ప్రారంభిస్తే.. బేరం కుదరకపోతే… ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రకటన పూర్తవుతుందేమోనని… అసంతృప్తుల సర్దుబాటు కూడా పూర్తి చేసి ప్రచారంలో దూసుకుపోతారు. బీజేపీతో పొత్తు చర్చలు ఆలస్యంగా ప్రారంభమైనా త్వరగా ముగించాలని.. సీట్ల క్లారిటీ చాలా ముఖ్యమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
