Pawan delay janasena candidates announcement : అంత బలమే ఉంటే ఆలస్యం ఎందుకు పవన్..?

Qubetvnews - March 5, 2024 / 07:00 PM IST

Pawan delay janasena candidates announcement : అంత బలమే ఉంటే ఆలస్యం ఎందుకు పవన్..?

Pawan delay janasena candidates announcement : పవన్ కల్యాణ్‌ మాటలకు చేతలకు అస్సలు సంబంధమే ఉండట్లేదు. ఆయన చెప్పేది ఒకటి అయితే చేసేది ఇంకొకటి అన్నట్టు ఉంది పరిస్థితి. మాటలేమో కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటట్లేదు. పవన్ కల్యాణ్‌ పదే పదే తన పార్టీ ఇప్పుడు చాలా బలంగా ఉందని చెప్పుకుంటున్నారు. జగన్ ను ఓడించడం కోసమే తన పార్టీ బలాన్ని టీడీపీతో జోడించినట్టు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే తన పార్టీతో పొత్తులు పెట్టుకున్న తర్వాతనే చంద్రబాబు పార్టీకి గ్రాఫ్‌ పెరిగిందని తన అనుచరులతో ప్రచారం చేసుకుంటున్నారు పవన్ కల్యా ణ్‌.

మరి ఇంత బలంగా జనసేన నిజంగానే ఉంటే అభ్యర్థులను ప్రకటించడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తులు పెట్టుకుంది. ఇందులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే సీట్లు 3 ఎంపీ సీట్లు కేటాయించారు. అయితే ఎంపీ సీట్లను అలా పక్కన పెడుదాం. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది అందరికీ కూడా. కాగా ఇప్పుడు జనసేన నుంచి కేవలం ఐదుగురికి మాత్రమే టికెట్లు కేటాయించారు. ఇంకా 19 మందికి టికెట్లు కేటాయించలేదు పవన్ కల్యాణ్‌.

ఎన్నికలకు సరిగ్గా 40 రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో ఓవైపు వైసీపీ దాదాపు అందరు అభ్యర్థులను ప్రకటిస్తుంటే.. సదరు అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతున్నారు. మరి ఇప్పుడు జనసేన అంత బలంగా ఉంటే అభ్యర్థులను ఎందుకు ప్రకటించట్లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతోంది. పవన్ కల్యాణ్‌ కు 24 సీట్లు ప్రకటిస్తే అందులో ఇంకా పట్టుమని పది మందిని కూడా ప్రకటించుకుండా అలా సస్పెన్స్ లో పెట్టేశారు. అలాంటప్పుడు ఇంక ఎక్కువ మందిని ప్రకటిస్తే ఏం పరిస్థితి అని నిలదీస్తున్నారు రాజకీయ నిపుణులు.

ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు దిక్కులేక ఇతర పార్టీల్లో రిజెక్ట్ చేసిన వారిని పవన్ కల్యాణ్‌ తెచ్చుకుని తన పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇంకా కూడా చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది పవన్ కల్యాణ్‌ కు. అందుకే ఇప్పుడు జనసైనికుల్లో చాలా అయోమయం ఉంది.

పార్టీ కోసం కష్టపడ్డ జనసైనికులకు టికెట్లు ఇవ్వడానికి పవన్ కల్యాణ్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. తనకు ఆర్థికంగా బలమైన అభ్యర్థులు కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఇతర పార్టీల నేతల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని అటున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News