Raghurama krishnam raju : టికెట్ రాకుంటే జగన్ ను నిందిస్తారా.. ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా..?
Qubetvnews - March 25, 2024 / 12:30 PM IST
Raghurama krishnam raju : వైసీపీ వాళ్లకు టికెట్ రాలేదంటే అప్పుడు జగన్ ను తిట్టుకోవడంలో ఓ అర్థం ఉంది. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో టికెట్ రాని వాళ్లు కూడా ఇప్పుడు జగన్ ను తిడుతున్నారంటే.. వారికి ఏ మాత్రం వివేకం ఉందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ విమర్శిస్తోంది. ఇప్పుడు రఘురామ కృష్నం రాజు ఇలాంటి పనే చేస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచారు. జగన్ పిలిచి మరీ టికెట్ ఇస్తే.. గెలిచిన తర్వాత తన ఆస్తులు పెంచుకోవడానికి జగన్ అడ్డు వస్తున్నాడని పార్టీ నుంచి వెళ్లిపోయాడనేది వైసీపీ వాదన. ఇక వైసీపీ నుంచి వెళ్లిన తర్వాత ఎక్కువగా బీజేపీ భజన చేస్తున్నాడు.
ఇన్ని రోజులు జగన్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడంటూ వైసీపీ చెబుతోంది. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పడుతుందని మొదటి నుంచి రఘురామ కృష్ణంరాజు తెలిపాడు. ఆయనకు ముందే హింట్ ఉందో లేదో తెలియదు గానీ.. ఆయన చెప్పినట్టుగానే కూటమి ఏర్పడింది. ఇంకేంటి కూటమి ఏర్పడింది కాబట్టి.. తనకు బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ టికెట్ వస్తుందని పెద్ద పెద్ద ఆశలే పెంచుకున్నాడు. రీసెంట్ గానే తనకే నర్సాపురం టికెట్ అంటూ ప్రకటించుకున్నాడు. కానీ ఇప్పుడు నర్సాపురం ఎంపీ టికెట్ ను బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించారు.
దాంతో ఇప్పుడు వైసీపీ మీద నిందలు మోపుతున్నాడు రఘురామకృష్నంరాజు. జగన్ కావాలనే తనకు టికెట్ రాకుండా చేశాడని ఆరోపిస్తున్నాడు. అది విన్న వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే వైసీపీ నుంచి టికెట్ రాలేదంటే జగన్ ను నిందించొచ్చు గానీ.. ప్రతిపక్ష కూటమిలో టికెట్ రాకపోతే జగన్ కు ఏంటి సంబంధం అని అడుగుతున్నారు వైసీపీ నేతలు. ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది ఆ పార్టీలు చూసుకుంటాయి. అంతే గానీ.. జగన్ చెప్పిన వాళ్లకు కూటమిలో టికెట్లు ఇస్తారా.. ఇంతకన్నా అజ్ఞానం ఉంటుందా అని అడుగుతున్నారు వైసీపీ నేతలు.
అసలు టికెట్ రావాలంటే జనాల్లో ఉండాలి. జనంలో పట్టు పెంచుకోవాలి. అంతే గానీ.. ఏదో నాలుగు సార్లు టీవీల్లో కనిపించి సెలబ్రిటీలా ఫీల్ అయిపోతే టికెట్లు ఇస్తారనుకోవడం అవివేకం. ఎందుకంటే రఘురామ కంటే ఎక్కువగా టీవీల్లో కనిపించే మహాసేన రాజేశ్, తీన్మార్ మల్లన్న లాంటి వాళ్లకే టికెట్లు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు.
అలాంటిది వాళ్లకంటే తక్కువగానే టీవీల్లో కనిపించే రఘురామకు టికెట్ ఎలా ఇస్తారనుకున్నారు. ఆ మాత్రం తెలియదా.. మరి నిజంగానే రఘురామకు పట్టు ఉంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవొచ్చు కదా.. అలా చేయకుండా జగన్ ను నిందించడం దేనికి. జగన్ రివేంజ్ తీర్చుకోవాలనుకుంటే పోటీలో ఓడించి చూపిస్తాడు కానీ.. ఇలా టికెట్ రాకుండా ఆయనెందుకు అడ్డుపడుతాడు అని వైసీపీ వాదిస్తోంది. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు జగన్ కు పూర్తి వ్యతిరేక పార్టీలే కదా అని గుర్తు చేస్తున్నాయి. జగన్ ఇవ్వమంటే ఇస్తారా.. వద్దంటే ఊరుకుంటారా అని అడుగుతున్నారు వైసీపీ నేతలు.
