Tdp : జగన్ పై అక్కసు.. ఆయన్ను టార్గెట్ చేస్తున్న టీడీపీ కూటమి..!
Qubetvnews - May 27, 2024 / 09:00 AM IST
Tdp : ఏపీ రాజకీయాల్లో మిగతా రాష్ట్రాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలకు సేవలందిద్దామని అనుకుంటే ఎవరూ సహకరించరు. అందరూ అడ్డుపడుతూనే ఉంటారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఎంత నిజాయితీగా ప్రజలకు సేవలందిస్తున్నా సరే ఆయనకు అందరూ అడ్డుపడుతూనే ఉన్నారని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిదానికి అడ్డుపడుతూ ఇన్ని రోజులు పాలనకు కాలు అడ్డం పెట్టారు. ఇప్పుడు జగన్ ను ఏమీ చేయలేక ఆయనకు సహకరిస్తున్న వారిపై కుట్రలు పన్నుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇందులో భాగంగా ఏపీ సీఎస్ అయిన జవహర్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల ముందు జవహర్ రెడ్డిని తప్పించేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు చంద్రబాబు. కానీ అది కుదరలేదు. దాంతో ఇప్పుడు కౌంటింగ్ లోపు అయినా సరే ఆయన్ను తప్పించాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా లేనిపోని నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారు. తాజాగా ఓ జనసేన నాయకుడితో సంచలన ఆరోపణలు చేయించారు. జవహర్ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఉత్తరాంధ్రలో దాదాపు 800 ఎకరాల అసైన్డ్ భూమిని పట్టా చేయించుకున్నారని ఆరోపించారు.
ఇది వినడానికి కూడా చాలా విడ్డూరంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత సర్వాధికారాలు ఉన్నప్పటికీ మరీ అంత భూమి పట్టా చేయించుకోవడం సాధ్యం అవుతుందా.. కనీసం ఆరోపణలు చేసేటప్పుడు అయినా వెనకా ముందు ఆలోచించుకోవాలి కదా అంటున్నారు. ఇక ఇదే విషయం మీద సీఎస్ కూడా చాలా ఘాటుగానే స్పందించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సదరు వ్యక్తి మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఇక్కడ చంద్రబాబు ఓ విషయం మర్చిపోయినట్టు ఉన్నారు.
అదేంటంటే బీజేపీ చంద్రబాబు, పవన్ కల్యాన్ పొత్తులు పెట్టుకున్నదే వ్యవస్థల సహకారం కోసం కదా. మరి అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ వారి చేతిలో ఉందని వారు భావిస్తున్నారు. మరి ఈసీ ముందు సీఎస్ ఎంత. ఈసీని కాదని సీఎస్ ఏమైనా చేయగలడా.. అలా చేస్తే క్షణం కూడా ఆ కుర్చీలో ఉండడు అని చంద్రబాబుకు తెలుసు కదా.
మరి ఇంకెందుకు ఈ హైరానా.. గతంలో చంద్రబాబు నియమించుకున్న సీఎస్ ను ఈసీ తొలగించిన విషయం చంద్రబాబు మర్చిపోయినట్టు ఉన్నారు. ఈసీకి ఒక్క ఫిర్యాదు చేస్తే సీఎస్ ను తీసిపారేస్తుంది. అయినా సరే సీఎస్ మీద అక్కసుతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు.





