Ap ministers : ఒకప్పటి టీచర్లే నేటి మంత్రులు.. ఏపీలో కొత్త ట్రెండ్..

Qubetvnews - June 19, 2024 / 09:41 PM IST

Ap ministers : ఒకప్పటి టీచర్లే నేటి మంత్రులు.. ఏపీలో కొత్త ట్రెండ్..

Ap ministers : ఏపీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు టీచర్లుగా పనిచేసిన వారే ఇప్పుడు మంత్రులుగా రాణిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలో నుంచే ఇది సాగుతోంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేసిన సుజాత, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తానేటి వనిత, ఇప్పుడు చంద్రబాబు కేబినెట్ లో హోం మినిస్టర్ అయిన వంగలపూడి అనిత కూడా టీచర్లుగానే పనిచేశారు. ఈ ముగ్గురూ గతంలో టీచింగ్ ఫీల్డ్ లో ఉండి.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో వచ్చి ఏకంగా మంత్రులు కూడా అయ్యారు. తానేటి వనిత మొదట్లో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు.

అప్పట్లో నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఇంట్రెస్ట్ తో ఆమె తండ్రి వారసత్వంగా వచచారు. 2009లో టీడీపీ తరపున గోపాలపురం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ 2012లో ఎమ్మెల్యే పదవికి, టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 లో కొవ్వూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. కానీ 2019లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి జగన్ కేబినెట్ లో ఐదేండ్ల పాటు మంత్రిగా పనిచేశారు. హోం శాఖను నిర్వర్తించారు. ఇక వంగలపూడి అనిత కూడా మొదట్లో లెక్చరర్ గానే పనిచేశారు.

కానీ తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో పాయకరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కానీ 2019లో కొవ్వూరు నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి గెలిచి ఇప్పుడు ఏకంగా హోం మంత్రి అయిపోయారు. ఇక మాజీ మంత్రి పీతల సుజాత కూడా గతంలో టీచర్ గా పనిచేశారు. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చారు. ఆచంట నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2009లో పోటీ చేయలేదు.

కానీ 2014లో చింతలపూడి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు కేబినెట్ లో మహిళా స్త్రీ శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఒకప్పుడు టీచర్లుగా పనిచేసిన వారే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మంత్రులుగా పనిచేసి ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News