Ys Jagan : ఫలితాలపై జగన్ ధైర్యం ఏంటి.. ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

Qubetvnews - May 18, 2024 / 01:01 PM IST

Ys Jagan : ఫలితాలపై జగన్ ధైర్యం ఏంటి.. ఇంత పెద్ద స్కెచ్ ఉందా..?

Ys Jagan : ఏపీలో పోలింగ్ ముగిసింది. బ్యాలెట్ బాక్సుల్లో పార్టీల భవితవ్యం ఉంది. అయితే పోలింగ్ సరళిపై ఎవరి అంచనాలు వారివే ఉన్నాయి. అటు టీడీపీ తామే గెలుస్తున్నామని చెబుతోంది. కానీ టీడీపీ మీడియా పైకి తమదే గెలుపు అని భావిస్తోంది గానీ.. జగన్ కాన్పిడెన్స్ ను చూస్తే వారికి నిద్ర పట్టట్లేదు. జగన్ మొన్న ఐ ప్యాక్ టీమ్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమో ఆశ్చర్యపోయే ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. దాంతో అటు టీడీపీ కూటమిలోనే కాకుండా ఇతర పార్టీల నేతల్లో కూడా టెన్షన్ మొదలైంది. జగన్ వద్ద ఏముందని అంత కాన్పిడెన్స్ తో మాట్లాడుతున్నారు.. ఎలాంటి బలమైన ఆధారం లేకుండా జగన్ అలాంటి వ్యాఖ్యలు చేయరు.

అవును జగన్ వద్ద ఓ బలమైన అస్త్రమే ఉందని తెలుస్తోంది. ఐ ప్యాక్ టీమ్ లోని కొందరు అనుభవజ్ఞులు కలిసి ఓ యాప్ ను రూపొందించారని సమాచారం. ఈ యాప్ ద్వారా చాలా కచ్చితమైన సర్వేలు చేసి ఏ మాత్రం తేడా లేని ఫలితాలను ఇస్తున్నారు. ఈ యాప్ ను మొన్న తెలంగాణ ఎన్నికల్లో సర్వే చేసి ఫలితాలను బేరీజు వేసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 60 నుంచి 65 సీట్లు వస్తాయని ఈ యాప్ సర్వే తెలిపింది. అది చెప్పినట్టుగానే కాంగ్రెస్ 63 సీట్లతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీ పోలింగ్ రోజున కూడా ఈ యాప్ టీమ్ కలిసి సర్వే చేసింది.

ప్రతి నియోజకవర్గంలో 1700 మందిపై ఈ సర్వే చేశారంట. వివిధ ప్రాంతాలు, రకరకాల భౌగోళిక వసతులు ఉన్న ఏరియాల్లో ఈ సర్వే చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో చేసినట్టే ఏపీలో కూడా పకడ్బందీగా, కచ్చితమైన ఆధారాలతో సర్వే చేశారు. కాగా ఈ సర్వేను జగన్ మోహన్ రెడ్డి సెంట్రల్ ఆఫీస్ ఆపరేట్ చేసింది. ఐ ప్యాక్ టీమ్ సభ్యులు ఇందులో కీలకంగా వ్యవహరించారు. ఆధారాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తగా ఫలితాలను జగన్ మోహన్ రెడ్డికి చేరవేశారు. అయితే ఈ సర్వే ప్రకారం 56 శాతం ఓటింగ్ వైసీపీకి పడినట్టు తేలిపోయింది.

పక్కా అంచనాల ప్రకారం వైసీపీకి 156 సీట్లు వస్తున్నట్టు ఐ ప్యాక్ టీమ్ జగన్ కు నివేదిక ఇచ్చింది. అందుకే జగన్ అంత కాన్ఫిడెన్స్ గా భారీ సీట్లు సాధిస్తున్నామని చెబుతున్నారు. అయితే ఈ సర్వే ప్రకారం కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతున్నారంట.

అటు మంగళగిరిలో లోకేష్, పిఠాపురంలో పవన్ మాత్రం గెలుస్తున్నట్టు తేలింది. కానీ వైసీపీకి మాత్రం ఎలాంటి నష్టం లేదని ఈ సర్వే తేల్చి చెప్పింది. అందుకే వైసీపీలో అందరూ కొంత ఆందోళన చెందుతున్నా జగన్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారంట.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News