Ap Politics : వ్యక్తిగత విమర్శలు ఆగిపోనున్నాయా.. ఏపీ రాజకీయాల్లో మార్పు..

Qubetvnews - July 17, 2024 / 03:05 PM IST

Ap Politics : వ్యక్తిగత విమర్శలు ఆగిపోనున్నాయా.. ఏపీ రాజకీయాల్లో మార్పు..

Ap Politics : ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైందా.. వ్యక్తిగత విమర్శలకు తావు లేకుండా పోతుందా అంటే అవుననే సమాధానాలు తెరమీదకు వస్తున్నాయి. ఎందుకంటే గత పదేండ్లుగా ఏపీలో ప్రజా సమస్యలను మించి రాజకీయ నేతల వ్యక్తిగత విమర్శలపైనే ఎక్కువగా చర్చ జరిగిందంటే వారు ఏ స్థాయిలో మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు మార్పు ఒకింత వస్తోందనే చెప్పుకోవాలి. ఇక గత ఐదేండ్ల కాలంలో వ్యక్తిగత విమర్శళు, వ్యక్తిగత దూషణలు బాగా పెరిగాయి. వాటి ఫలితంగా ఏపీ రాజకీయాలు అంటే ఇంత దారుణంగా ఉంటాయా అని నేషనల్ మీడియాలో కూడా చర్చ జరిగింది.

అంత దారుణంగా పార్టీల నేతలు వ్యవహరించారు. అయితే ఇలాంటి వ్యక్తిగత దూషణలు అనేవి ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వాటిని పక్కన పెట్టేందుకు అంతా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ఎవరినీ కూడా వ్యక్తిగతంగా విమర్శించడం కానీ.. వ్యక్తిగతంగా దూషించడం గానీ పెద్దగా కనిపించట్లేదు. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అటు కూటమి నేతలు కూడా తమ ఎమ్మెల్యేలకు వ్యక్తిగత దూషణలు వద్దని పదే పదే చెబుతున్నారు. ఇటు జగన్ కూడా వైసీపీ నేతలను చాలా కంట్రోల్ లో పెడుతున్నారు.

దీంతో ఇకపై వ్యక్తిగత దూషణలు అనేవి కనిపించకుండా పోతాయేమో అని అంటున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా సరే కేవలం ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రయోజనాల మీదనే మాట్లాడుతున్నారు. అంతే తప్ప మిగతా విషయాలపై మాత్రం అస్సలు మాట్లాడట్లేదు. కాబట్టి ఏపీ రాజకీయాల్లో ఒక రకమైన మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చేమో.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News