Pawan Kalyan : పవన్ మాటలను టీడీపీ పట్టించుకుంటుందా..?

Qubetvnews - July 16, 2024 / 11:47 AM IST

Pawan Kalyan : పవన్ మాటలను టీడీపీ పట్టించుకుంటుందా..?

Pawan Kalyan : ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మూడు పార్టీల ప్రభుత్వం ఉంది. టీడీపీకి సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ వచ్చింది. అయినా సరే ముందుగానే పొత్తులు పెట్టుకున్నారు కాబట్టి జనసేన, బీజేపీ పార్టీలకు కూడా భాగస్వామ్యం దక్కింది. అయితే టీడీపీ, బీజేపీ పార్టీల కన్నా కూడా అందరి చూపు జనసేన మీదనే ఉంది. ఎందుకంటే పవన్ కల్యాణ్‌ మీద అందరికీ చాలానే ఆశలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు, బీజేపీ పాలనను ఏపీ ప్రజలు చూశారు. కానీ పవన్ కల్యాణ్‌ పాలన మీదనే అందరికీ చాలా ఆశలు ఉన్నాయి. ఆయన కూడా మొదటి నుంచి కొన్ని మార్పులు అంటూ మాట్లాడుతున్నారు.

అధికారంలోకి వచ్చిన రోజు కూడా ఆయన వైసీపీ మీద కక్ష సాధింపు చర్యల కోసం ఈ గెలుపు కాదు అని తెలిపారు. వైసీపీ నేతలు ప్రత్యర్థులు మాత్రమే కానీ.. శత్రువులు కాదు అంటూ మాట్లాడారు పవన్ కల్యాణ్‌. ఇలా ఆయన పదే పదే వైసీపీ నేతల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏపీలో వైసీపీ నేతల ఇండ్ల మీద దాడులు జరుగుతున్నాయి. వారి కట్టడాలను మొత్తం కూల్చి వేస్తున్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఏపీలో రెడ్ బుక్ అమలు జరుగుతోందని.. ఇందులో భాగంగానే జగన్ మీద రఘురామ కృష్ణంరాజు కూడా కేసు పెట్టాడని చెబుతున్నారు.

ఇలా ఎక్కడికక్కడ వైసీపీ నేతలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏమైనా అంటే వారు తప్పులు చేశారు కాబట్టే వారిపై కేసులు నమోదవుతున్నాయంటూ చెబుతున్నారు. అయితే ఇలా కేవలం వైసీపీ నేతలపైనే కేసులు నమోదవుతున్నాయి తప్ప.. వేరే వారిపై ఎందుకు నమోదు కావట్లేదు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి పవన్ కల్యాణ మాటలు చెబుతున్నారు గానీ.. టీడీపీ మాత్రం పట్టించుకోకుండా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ వైసీపీలో చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్‌ టీడీపీని కంట్రోల్ చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి.

మరి మార్పు మార్పు అని చెబుతున్న పవన్.. వైసీపీ వాళ్లు శత్రువులు కాదు.. మిత్రులే అని చెబుతున్న పవన్.. వైసీపీ నేతలపై దాడులను ఎందుకు ఖండించట్లేదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మరి పవన్ కల్యాణ్‌ మాటలను మున్ముందు టీడీపీ పట్టించుకుంటుందా.. లేదంటే పక్కన పెడుతుందా అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News