Ys Jagan : వైసీపీ కార్యకర్తల ఆవేదన.. తమను గుర్తించాంటూ వేడుకోలు..!

Qubetvnews - October 17, 2024 / 08:06 PM IST

Ys Jagan : వైసీపీ కార్యకర్తల ఆవేదన.. తమను గుర్తించాంటూ వేడుకోలు..!

Ys Jagan : ఐదేండ్లు పార్టీ అధికారంలో ఉన్నా మాకేం లాభం జరగలేదు. పైగా నష్టపోయాం. ఇకనైనా మమ్మల్ని గుర్తించి ఆదరించండి అంటూ అడుగుతున్నారు సంత పార్టీ కేడర్. ఈ విషయం మాజీ సీఎం జగన్ కు లెటర్ల ద్వారా వివరిస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్న ఐదేండ్లలో ఏనాడు కూడా తన అనుచరులకు, కార్యకర్తలకు ప్రభుత్వ పరంగా లాభం జరగాలని ఆలోచించలేదు. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి అనే నినాదంతోనే పనిచేశారు. అంతే తప్ప పథకాలు, ఇతర పనుల్లో సొంత పార్టీ వాల్లకే పెద్ద పీట వేయాలని ఆలోచించలేదు అనేది నగ్న సత్యం.

సమానంగా అందరికీ ఫలాలు అందాలని ఆలోచించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది వేరేలా ఉంది. మద్యం పాలసీలో కూడా సొంత పార్టీ వాళ్లకే ఎక్కువగా లాభాలు జరిగేలా చూసుకుంటున్నారు. కానీ గతంలో జగన్ అసలు ఇలాంటి పాలసీలే పెట్టలేదు. ప్రజలకు మంచి జరిగితే అదే చాలనుకున్నారు. కానీ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు ఏదో ఒక లాభం జరగాలని ఆశిస్తారు కదా. పార్టీ అధికారంలోకి వస్తే ఆర్థికంగా తమకు ఓ భరోసా కలుగుతుందని భావిస్తారు. కానీ అలా జరగనందున వారు కూడా ఒకింత ఆలోచనలో పడ్డారు.

సొంత పార్టీ నేతల ప్రవర్తన కావచ్చు మరేదైనా కావచ్చు.. వారిని పార్టీతో దూరం జరిపింది. అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్లీ అదే కార్యకర్తలు జగన్ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తమను గుర్తించాల్సిందే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఫలితం లేకపోతే ఎలా అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కచ్చితంగా తమకు లాభం జరిగే పనులు చేస్తేనే బెటర్ అనే వాదన వారి నుంచి వినిపిస్తోంది. అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ లాగా జగన్ కూడా ఆలోచించాలని కోరుతున్నారు.

కార్యకర్తల మనో వేదనను పట్టించుకుంటేనే ఆ నాయకుడిపై కూడా అందరికీ మమకారం పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికైనా జగన్ గుర్తించాలి. ప్రజలు ఎంత ముఖ్యమో.. పార్టీకి కార్యకర్తలు కూడా అంతే ముఖ్యం అనే విషయాన్ని జగన్ గుర్తుంచుకుంటే.. ఆయనకు జరిగే మేలు అంతా ఇంతా కాదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News