Aishwarya Rajinikanth : అనిరుధ్ వల్లే నా సినిమా ప్లాప్ అయింది.. ఐశ్వర్య రజినీకాంత్ సంచలనం..!
Qubetvnews - February 17, 2024 / 07:38 AM IST
Aishwarya Rajinikanth :
ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే అనిరుధ్ అని చెప్పుకోవాలి. మనోడు ఇచ్చే మ్యూజిక్ కు అంతా ఫిదా అయిపోతున్నారు. వరుసగా ఆయన చేస్తున్న మ్యూజిక్ చిన్న వారి దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాక అందరినీ ఊపేస్తోంది. దాంతో స్టార్ హీరోలు కూడా క్యూ కట్టి మరీ ఆయన్ను పెట్టేసుకుంటున్నారు. దాంతో ఆయనకు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా చేసిన హుకుం సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా వరుసగా పెద్ద పాన్ ఇండియా సినిమాలకు సాంగ్స్ చేస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ వల్లే సినిమాలకు హైప్ పెరిగి హిట్ అవుతున్నాయని అందరూ నమ్ముతున్నారు.
ఇక ఆయన లైవ్ షోలకు కూడా ఓ రేంజ్ లో డిమాండ్ పెరుగుతోంది. ఆ షోల టికెట్ లు కూడా హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతున్నాయి. ఇలాంటి సమయంలో అనిరుధ్ వల్లే తన సినిమా ప్లాప్ అయిందని సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె తాజాగా లాల్ సలాం అనే సినిమాను డైరెక్ట్ చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తన మొదటి సినిమా ‘3’ ఎందుకు ప్లాప్ అయిందో చెప్పేసింది. అందుకు కారణం అనిరుధ్ అని చెప్పి సంచలనం రేపింది.
ఆ సినిమాలో అనిరుధ్ కంపోజ్ చేసిన కొలవరి ఢీ సాంగ్ ఓ రేంజ్ లో హిట్ అయిపోయింది. దేశ వ్యాప్తంగా ఓ ఊపు ఊపేసింది. సినిమా రిలీజ్ కాకముందే జనాలకు బాగా ఎక్కేసింది. ఆ పాట పెద్ద సక్సెస్ కావడంతో సినిమాలో కంటెంట్ ను కూడా ఓవర్ షాడో చేసేసింది. దాంతో పాట విన్న వారంతా ఆ సినిమాకు ఓ రకమైన అంచనాతో వెళ్లారు. కానీ సినిమా మొత్తం సీరియస్ కంటెంట్ తో ఉంది. అందుకే ఆ సినిమా కథ వారికి ఎక్కలేక పోయింది. అందుకే చూసిన వారు సినిమా బాగాలేదని చెప్పుకొచ్చారు. అలా అనిరుధ్ వల్లే నా సినిమా పోయిందని చెప్పింది ఐశ్వర్య.

Aishwarya Rajinikanth Sensational Comments On Anirudh Ravichander
కాకపోతే తనకు చాలా సంతోషంగా ఉందని కూడా చెప్పింది. ఎందుకంటే అనిరుధ్ నా సినిమాతోనే చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలకు ఆయన సంగీతం అందిస్తుండటంతో నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది. అనిరుధ్ కు నా సినిమా ఓ బేసిక్ గా ఉన్నందుకు సంతోషిస్తున్నాను.
కాకపోతే రీ రిలీజ్ లో 3 సినిమాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా అప్పుడు జనాలకు నచ్చింది. ఎందుకంటే అప్పటికే కొలవరీ సాంగ్ హైప్ బాగా తగ్గిపోయింది. అందు వల్ల సినిమా కంటెంట్ జనాలకు నచ్చేసింది. అందుకు నేను ఆనందపడుతుంటాను అంటూ తెలిపింది ఐశ్వర్య.





