Amardeep : వాడిని చంపేసేవాడిని.. అమర్ దీప్ కాంట్రవర్సీ కామెంట్లు..!
Qubetvnews - February 17, 2024 / 07:04 AM IST
Amardeep :
బిగ్ బాస్ సీజన్-7 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ షోకు అందరూ కనెక్ట్ అయిపోయారు. దానికి కారణం పల్లవి ప్రశాంత్ అనే చెప్పుకోవాలి. ప్రశాంత్ కు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయంగ్ ఏర్పడింది. దానికి కారణం అమర్ దీప్ బ్యాచ్ చేసిన రచ్చనే. బిగ్ బాస్ లో సీరియల్ బ్యాచ్ అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేయడం వల్లనే ఈ షోకు విపరీతంగా ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే అంతకు ముందు జరిగిన రెండు సీజన్ ల కంటే ఏడో సీజన్ కు ఎక్కువ టీఆర్పీ రేటింగ్ రావడానికి కారణం కూడా అదే.
కాగా ప్రశాంత్ ను అమర్ దీప్ టార్గెట్ చేయడంతో ఆయనపై అభిమానులు రగిలిపోయారు. ఫినాలే తర్వాత బయటకు వచ్చినప్పుడు అమర్ దీప్ కారు మీద కొందరు పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారు మీద రాళ్లు విసిరారు. చాలా కష్టమైన పరిస్థితుల మధ్య అమర్ దీప్ తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి నుంచి బయట పడ్డాడు. అయితే ఇదే దాడి మీద ఆయన ఇప్పటికే చాలా సార్లు స్పందించాడు. ఇక తాజాగా మరోసారి రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఆయన తన భార్య తేజస్వినితో కలిసి కాఫీ విత్ శోభాశెట్టి టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షో సుమన్ టీవీలో ప్రసారం అవుతోంది.
ఈ ప్రోగ్రామ్ లో మరోసారి తనపై జరిగిన దాడి గురించి అమర్ దీప్ మాట్లాడాడు. ఆ రోజు నా తల్లికి ఏమైనా జరిగి ఉంటే కచ్చితంగా ఎవరో ఒకిడిని చంపేసేవాడిని. కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కారు మీద రాళ్లు విసిరితే మీరు ఊరుకోరు కదా. వాళ్లకు కావాల్సింది నేను ఒక్కడినే.
నన్ను రమ్మంటే కారు దిగి వెళ్లేవాడిని వారందరూ నన్ను కొడితే కనీసం ఒక్కడినైనా కొట్టేవాడిని. ఆ రోజు జరిగిన దాడిని ఎన్నటికీ మర్చిపోలేను. అదృష్టం బాగుండి ఎవరికీ ఏమీ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు అమర్. అయితే కారు డ్యామేజ్ కు ఎంత ఖర్చు అయింది అని అడగ్గా.. దాదాపు రూ.రూ.3.5 లక్షలు అయ్యిందని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు.





