Bachhala malli movie review : బచ్చలమల్లి మూవీ రివ్యూ..!

Qubetvnews - December 20, 2024 / 11:33 AM IST

Bachhala malli movie review : బచ్చలమల్లి మూవీ రివ్యూ..!

Bachhala malli movie review : అల్లరి నరేష్ ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్. కానీ నాంది సినిమా నుంచే ఆయన రూటు మార్చాడు. కామెడీని పక్కన పెట్టేసి సీరియస్ కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా సరే.. ఆయనకు నటన పరంగా బాగానే పేరు దక్కుతోంది. ఈ సారి కూడా బచ్చలమల్లి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్లు ఆసక్తిని రేపాయి. సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా చేస్తోంది. మరి నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆకట్టుకుందా లేదా అనేది చూద్దాం.

కథ ఏంటంటే..?

బచ్చలమల్లికి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే చాలా ఇష్టం. కానీ తన తండ్రి రెండో పెళ్లి చేసుకోవడంతో తల్లికి అన్యాయం చేశాడని కోపం పెంచుకుంటాడు. తన తండ్రి తనను వదిలేసి వెళ్లిపోతాడు. అప్పటి నుంచి తండ్రిపై అతనికి ఉన్న కోపం కాస్త పగగా మారుతుంది. అంతే కాకుండా బచ్చలమల్లి చదువు మానేసి చెడు అలవాట్లకు బానిస అవుతాడు. జీవితం చేతులారా నాశనం చేసుకుంటాడు మల్లి. మందు, సిగరెట్లు, చెడు తిరుడు అన్నీ అలవాటు అవుతాయి. వీటన్నింటికీ మించి అతనికి మూర్ఖత్వం అనువనువు పెరుగుతుంది. అలా గాలికి తిరిగే మల్లికి కావేరీ (అమృత అయ్య‌ర్) కనిపిస్తుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. ఆమె కోసం తన చెడు అవాట్లను మానేస్తాడు. చివరకు అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అతనిలో మూర్ఖత్వం మళ్లీ పెరుగుతుంది. అలాంటి సమయంలో బచ్చలమల్లి తప్పుడు దారి పడుతాడా చివరకు తన జీవితాన్నం నాశనం చేసుకున్నాడా లేదంటే మంచి వైపు వెళ్లాడా అనేది తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?

ప్రతి మనిషి తనలో ఉన్న ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటేనే జీవితం బాగుంటుంది అని చెప్పే సినిమా ఇది. జీవితంలో కొన్ని చోట్ల తగ్గాలి లేదంటే బంధాలు, అనుబంధాలు నిలబడవు అనే చెప్పే సినిమా ఇది. అలా చేయకపోతే ఒంటరిగా మిగిలిపోతామని ఈ మూవీ చెబుతుంది. ఈ సినిమాలో ఒక మూర్కత్వపు క్యారెక్టరైజేషన్ మనకు కనిపిస్తుంది. కానీ అసలు ఈ సినిమాకు ఒక పర్‌ ఫెక్ట్ లాజిక్స్ అనేవి లేవు. ఈ సినిమా మొత్తం వ్యక్తి క్యారెక్టరైజేషన్ గురించే ఉంటుంది. అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి మల్లిగాడు అసలు అలా ఎందుకు మారాడు.. దాని వెనకాల కారణాలు బలంగా ఉన్నాయా అంటే లేవు. ప్రతి ఫ్రేమ్ లోనూ ముర్ఖత్వమే కనిపిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక అమ్మాయి ప్రేమ కోసం వెంటనే అన్నీ మానేయడం కూడా అంత అతికినట్టు అనిపించదు. అసలు నేను ఎందుకు మారాలి.. ఎవరికోసం మారాలి అనే బలమైన లైన్ ఉంటే బాగుండేదేమో. కానీ నరేష్ నటన వీటిని కొంత వరకు కవర్ చేసేసింది. ఇక అమ్మాయి కోసం మారాలి అనే కాన్సెప్టుతో ఈ మూవీని నడిపించడం అంటే కొంత అతకినట్టు అనిపించదు. మారేందుకు బలమైన సీన్ ను చూపించి ఉంటే కథ మరోలా ఉండేదేమో.

ఎవరెలా చేశారంటే..?

నరేష్ ఒక సరికొత్త పాత్రలో కనిపించాడు. ఇది అతనిలో మరో కోణాన్ని చూపిస్తుంది. ఇప్పటి వరకు అల్లరి నరేష్ ఇలాంటి పాత్ర చేయలేదు. అయినా సరే ఆయన ఒక మూర్ఖత్వపు పాత్రలో ఒదిగిపోయాడు. ప్రతి ఫ్రేమ్ లో కూడా ఆయన నటన చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఒక పాత్రలో డైరెక్టర్ చెప్పినట్టే నటించి మెప్పించాడు. ఇక అమృత అయ్యర్ కూడా గ్లామరస్ పాత్రలో బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో రావు రమేశ్ నటన బాగుంది. ఆయన పాత్ర సినిమాలో ఇంపాక్ట్ చూపిస్తుంది. వైవా హర్ష, ప్రసాద్ బెహరా కూడా బాగానే ఆకట్టుకున్నారు.

టెక్నికల్ గా ఎలా ఉందంటే..?

ఈ సినిమాను ఒక పాత్ర చుట్టూ రాసుకున్నాడు దర్శకుడు. అయినా ఆ పాత్రలో ఎలా మార్పు తేవాలి.. ఒక మారకపోతే ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది బలంగా చూపించి ఆ ఇంపాక్ట్ సినిమా చూసే ప్రేక్షకుడిపై పడేలా చేయడంతో డైరెక్టర్ కొంత వరకు పర్వాలేదనిపించాడు. కానీ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ చాలా చోట్ల డైరెక్టర్ మార్క్ కనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కదిలించేవిధంగానే ఉంది. చిన్నాన్న చుట్టూ రాసుకున్న అనుబంధాలు బాగున్నాయి. ఈ సినిమా మేకింగ్ బాగానే ఉంది. పాటలు కూడా ఆకట్టుకుఉన్నాయి. టేకింగ్ కూడా వావ్ అనిపిస్తుంది. డైరెక్టర్ సుబ్బు మొత్తంగా ఒక వ్యక్తి గుణం చుట్టూ రాసుకున్న కథ తెరకెక్కించడంలో మాత్రం కొంత పట్టు కోల్పోయాడనే చెప్పుకోవాలి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండే బాగుండేది.

ప్లస్ పాయింట్స్..

నరేష్ నటన
అక్కడక్కడా ఎమోషన్ సీన్లు

మైనస్ పాయింట్లు

బలమైన సీన్లు లేకపోవడం
సినిమా ముగింపు ఆకట్టుకోకపోవడం

చివరగా..

బచ్చలమల్లి అనే పాత్రకు నరేష్ పూర్తి స్థాయిలో న్యాయం చేసినా.. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తి స్థాయిలో ఆకట్టుకోవట్లేదు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News