Pallavi Prashanth : ఇచ్చిన మాట మర్చిపోయిన పల్లవి ప్రశాంత్.. జల్సాలు చేస్తూ ఎంజాయ్..!
Qubetvnews - February 17, 2024 / 08:49 AM IST
Pallavi Prashanth :
పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ సీజన్-7తో ఒక్కసారిగా టాప్ రేంజ్ లోకి దూసుకువచ్చాడు. ఈ సీజన్ తో ఆయన స్టార్ సెలబ్రిటీ అయిపోయాడు. అంతకు ముందు ఎవరికీ దక్కనంత క్రేజ్ ఈయనకు సొంతం అయిపోయింది. ఎందుకంటే అంతకు ముందు టైటిల్స్ గెలిచిన వారు ఎంతో కొంత సెలబ్రిటీ హోదా ఉన్నవారే. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఆయన బిగ్ బాస్ లో రైతుబిడ్డ కాన్సెప్టుతో చాలా ఫేమస్ అయ్యాడు. అంతే కాకుండా పల్లవి ప్రశాంత్ చెప్పిన మాటకు అందరూ ఫిదా అయ్యారు.
తాను ఒకవేళ టైటిల్ విన్నర్ అయితే మాత్రం కచ్చితంగా ఆ డబ్బులను తాను తీసుకోబోనని.. పేద రైతులకు పంచిపెడుతానంటూ హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో వేదికగా చాలా సార్లు ఈ మాటలు చెప్పాడు పల్లవి ప్రశాంత్. దాంతో ఆయన మాటలకు అందరూ ఫిదా అయ్యి ఆయనకు ఓట్లేసి గెలిపించారు. అయితే తాను అలా పంచిపెట్టిన వీడియోలను కూడా షేర్ చేస్తానని హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ అయిపోయి రెండు నెలలు కావస్తోంది. కానీ ఇంకా అలాంటి దాఖలాలు ఏమీ కనిపించట్లేదు. అసలు పల్లవి ప్రశాంత్ ఇప్పటి వరకు సాయం చేసిన వీడియోలు గానీ, ఫొటోలు గానీ, కనీసం వార్తలు కూడా రావట్లేదు.
ఇప్పుడు పల్లవి ప్రశాంత్ జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తోది. ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ వరుసగా వేడుకలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. సెలబ్రిటీ హోదాలో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అంతే కాకుండా శివాజీ, ప్రిన్స్ వారియర్ లతో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. డబ్బులు పంచిపెడుతానని చెప్పావు కదా.. ఇప్పుడు ఎందుకు అలా చేయట్లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. చూస్తుంటే పల్లవి ప్రశాంత్ సామాన్య జీవితాన్ని వదిలేసినట్టు తెలుస్తోంది.
ఇప్పుడు అతనికి ఫేమ్ ఉంది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు కూడా వస్తున్నాయంట. దాంతో పల్లవి ప్రశాంత్ ఇప్పుడు సెలబ్రిటీ హోదాను ఎంజాయ్ చేస్తున్నాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన వారు తిరిగి ఎండలో పని చేయడం చాలా కష్టం. కాబట్టి పల్లవి ప్రశాంత్ తిరిగి వ్యవసాయం చేసే సూచనలు అయితే కనిపించట్లేదు.

Bigg Boss 7 Winner Pallavi Prashanth Enjoying Celebrity Status
దాంతో ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారు. డబ్బులు పంచిపెడుతానని చెబితేన ఓట్లేశామని.. కానీ ఇలా చేసి రైతులకు చెడ్డ పేరు తీసుకువస్తున్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకపై సాయం చేసే అవకాశాలు కూడా లేకపోవచ్చు అని మండిపడుతున్నారు నెటిజన్లు. మొత్తానికి ప్రశాంత్ చేస్తున్న పనులు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

