Pushpa -2 : పుష్ప-2 నుంచి కీలక అప్డేట్.. ఫస్టాఫ్ లాక్..!
Qubetvnews - October 8, 2024 / 06:15 PM IST
Pushpa -2 : పుష్ప మూవీ కోసం దేశ వ్యాప్తంగా బన్నీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొదటి పార్టు పుష్ప ది రైజ్ పెద్ద హిట్ అయింది. దాంతో ఆ మూవీకిదేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దీనికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని ఒకసారి వాయిదా వేసింది మూవీ టీమ్. అయితే మూవీని మరింత క్వాలిటీగా తీర్చిదిద్దడం కోసమే ఇలా చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. డిసెంబర్ 6వ తేదీన మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్.
ఈ క్రమంలోనే పుష్ప మూవీ నుంచి ఓ భారీ అప్డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. ఫస్టాఫ్ లాక్ చేసినట్టు ప్రకటించారు. మొదటి భాగం ఊహకు కూడా అందనంత భారీగా ఉంటుందని తెలిపారు మూవీ మేకర్స్. బన్నీ అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుందని తెలిపారు. ఇక రెండో భాగం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. దాంతో పాటు అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న టైమ్ కు మూవీని రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ చెబుతున్నారు.
పుష్ప-2లోని సాంగ్స్ ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయిపోయాయి. త్వరలోనే మూవీకి సంబంధించిన వరుసగా అప్డేట్స్ కూడా వస్తాయని మూవీ మేకర్స్ ప్రకటిస్తున్నారు. నవంబర్ నుంచి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు మూవీ టీమ్. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సారి కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా భారీగా ప్రమోషన్లు చేయబోతున్నారు. రిలీజ్ కు ముందే ఈ మూవీ వెయ్యి కోట్ల బిజినెస్ చేసిందంటూ లెక్కలు చెబుతున్నారు. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా సరే ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్లు దాటేస్తుందని చెబుతున్నారు.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అనే ముద్రను బలంగా వేసుకోవాలని బన్నీ ఫిక్స్ అయిపోయాడు. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీతోనే మార్కెట్ ను పెంచుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. మరి బన్నీ ఆశించిన ఫలితం వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.





