Sonusood : సీఎం చంద్రబాబుపై సోనూసూద్ ప్రశంసలు.. ఆయన విజన్ బాగుందంటూ కామెంట్..
Qubetvnews - September 23, 2024 / 03:46 PM IST
Sonusood : ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు వంద రోజుల పాలనపై అనేక కథనాలు, ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి. చాలా మంది ఆయన పాలనపై ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దేశంలోనే అత్యంత పాపులర్ యాక్టర్, సమాజ సేవికుడు అయిన సోనూసూద్ కూడా స్పందించారు. ఆయన చంద్రబాబు పాలనపై ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తొలి 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచుతున్నారు.
ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాను. మీకు నా అభినందనలు. త్వరలో నే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. ఆంధ్ర ను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దేదుకు నా వంతు సాయం కూడా అందిస్తాను. ధన్యవాదాలు సార్ అంటూ మాట్లాడారు సోనూసూద్. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సోనూసూద్ గతంలో కూడా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు చంద్రబాబు పాలనపై దేశ వ్యాప్తంగా ఓ చర్చ జరుగుతోంది. ఎందుకంటే సోనూసూద్ ఇలా ప్రత్యేకించి ఓ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఎన్నడూ మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబుపై మాట్లాడేసరికి ఆ వీడియో కాస్త దేశ వ్యాప్తంగా వైరల్అ వుతోంది. సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న సోనూసూద్ స్వయంగా పొగిడాడు అంటే కచ్చితంగా చంద్రబాబు పాలన బాగుందేమో అనే చర్చ కూడా మొదలైంది.
ఏదేమైనా సరే చంద్రబాబు పాలనకు ఓ ఇమేజ్ క్రియేట్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇక చంద్రబాబు కూడా తన వంద రోజుల పాలనపై ఓ డిక్లరేషన్ ఇచ్చారు. రాబోయే నాలుగున్నరేళ్లలో కూడా ఏమేం చేయాలనుకుంటున్నది కూడా క్లియర్ గా చెప్పేశారు. ఇటు సంక్షేమాన్ని గత ప్రభుత్వం కంటే మెరుగ్గా తీసుకోవడమే కాకుండా.. అటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు.
తొలి 100 రోజుల్లో నే చంద్రబాబు నాయుడు గారు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సార్ తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారు. మిమ్మల్ని చూసి… pic.twitter.com/jXKN7OtJmo
— Telugu Desam Party (@JaiTDP) September 22, 2024





