Sukumar : రాజమౌళిలా మారిపోతున్న సుకుమార్.. అవే సెంటిమెంట్లు రిపీట్..!

Qubetvnews - October 18, 2024 / 09:48 PM IST

Sukumar : రాజమౌళిలా మారిపోతున్న సుకుమార్.. అవే సెంటిమెంట్లు రిపీట్..!

Sukumar : ఇండస్ట్రీలో రాజమౌళి అంటే నెంబర్ వన్ డైరెక్టర్ అని ఎవరైనా చెప్పేస్తారు. మరి నెంబర్ 2 ఎవరు అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఇందులో కొందరు డైరెక్టర్ సుకుమార్ పేరు చెప్పేస్తుంటారు. అయితే సుకుమార్ రంగస్థలం సినిమాకు ముందు ఒకలా ఉండేవాడు. కానీ రంగస్థలం సినిమా నుంచే పూర్తిగా మారిపోయాడు. ఇంకా చెప్పాలంటే రాజమౌళిని చాలా వరకు ఫాలో అవుతున్నాడు. రాజమౌళి ఒక్కో సినిమాకు అప్పట్లో రెండేళ్లు టైమ్ తీసుకునేవాడు. కానీ సినిమాలో మాస్ పల్స్, ఎమోషనల్స్ పల్స్, ఆడియెన్స్ నే సినిమాలో లీనం చేసే సీన్లతో దుమ్ములేపేవాడు.

అయితే రంగస్థలం సినిమాతో సుకుమార్ కూడా ఇలాంటి సెంటిమెంట్లను ఫాలో అవుతున్నాడు. తన సినిమాకు కూడా రెండేళ్లు టైమ్ తీసుకుంటున్నాడు. పైగా రాజమౌళి లాగానే సీన్లను రంగరించి పండిచేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంతే కాకుండా రాజమౌళి లాగానే సినిమా పూర్తయ్యే వరకు గడ్డం తీయట్లేదు. రాజమౌళి లాగానే సీక్వెల్ లు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పుష్ప విషయంలో అది బాగా కనిపిస్తుంది. రాజమౌళి తన ప్రతి సినిమాలో హీరోకు కొన్ని మేనరిజంలు పెడుతుంటాడు. ఇప్పుడు సుకుమార్ కూడా అలాగే పెడుతున్నాడు.

పుష్ప-2లో అల్లు అర్జున్ కు కూడా మేనరిజాన్ని పెట్టేశాడు సుకుమార్. ఇప్పుడు సుకుమార్ పుష్ప-2 షూటింగ్ లోనే మూడేండ్లకు పైగా గడిపేశాడు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి రిలీజ్ డేట్ దాకా షూటింగ్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి సుకుమార్ ఒక రకంగా రాజమౌళిని బాగా ఫాలో అవుతున్నాడనే చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్లకు పెట్టింది పేరు. అందుకు సుకుమార్ కూడా ఈ విషయంలో సెంటిమెంట్లను బాగా ఫాలో అవుతున్నాడని చెప్పుకోవాలి. ఇక హీరోయిన్లను రాజమౌళి తన సినిమాల్లో ఎంత రసవత్తరంగా చూపిస్తాడో తెలిసిందే.

సుకుమార్ కూడా ఇప్పుడు అలాగే తన సినిమాల్లో హీరోయిన్లను రొమాంటిక్ గా చూపిస్తున్నాడు. ఇక విలన్ల విషయంలో కూడా అంతే. రాజమౌళి సినిమాలో విలన్ లు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాడో.. సుకుమార్ కూడా తన సినిమాల్లో విలన్లను అంతే వపర్ ఫుల్ గా చూపిస్తున్నాడు. మరి రాజమౌళి లాగానే నేషనల్ లెవల్ లో పుష్ప-2లో చరిత్ర సృష్టిస్తాడా లేదా అనేది చూడాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News