Vijay Devarakonda : విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. భగ్గుమంటున్న తెలంగాణ

Qubetvnews - June 29, 2024 / 08:05 PM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండపై ట్రోల్స్.. భగ్గుమంటున్న తెలంగాణ

Vijay Devarakonda : ఇండస్ట్రీలో ఈ నడుమ ఎందుకో కొందరిపై పనిగట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారు కొందరు. అందులోనూ విజయ్ దేవరకొండపై అయితే మరీ ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన సినిమా హిట్ అయినా కూడా ఆయన మీద ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన ఏం చేసినా సరే అది బాగా లేదంటూ.. ఆయన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న నిర్వాకం. విజయ్ దేవరకొండ అంటే సెల్ఫ్ మేడ్ స్టార్. అది ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా కాదనలేని సత్యం. అలాంటి సెల్ఫ్ మేడ్ స్టార్ ను ఇంతలా టార్గెట్ చేయడం అంటే.. భవిష్యత్ లో సొంతంగా ఎదిగే వారు కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తోంది.

లైగర్ సినిమా నుంచే ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఖుషీ సినిమా మంచి క్లాసిక్ హిట్ అయినా సరే.. ఆ సినిమా ప్లాప్ అంటూ రకరకాలుగా ప్రచారం చేశారు. దాని తర్వాత ఫ్యామిలీ స్టార్ కూడా క్లాసికల్ గా ఉన్నా సరే.. దాన్ని కూడా దారుణంగా ఉందంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు విజయ్ కల్కి సినిమాలో అర్జునుడి పాత్ర చేశాడు. వాస్తవానికి అర్జునుడిగా విజయ్ బాగానే నటించాడు. థియేటర్ కు వెళ్లిన ఎవరైనా సరే ఈ విషయమే చెబుతున్నారు. కానీ కొందరు మాత్రం సినిమా విడుదలైన తెల్లారి నుంచే విషం చిమ్మడం ప్రారంభించారు. సినిమాకు అతిపెద్ద మైనస్ విజయ్ అర్జునుడిగా నటించడమే అంటూ ట్రోల్స్ చేయడం మొదలెట్టారు.

అయితే ఇక్కడే ట్రోలర్స్ కు దిమ్మతిరిగే షాక్ తగులుతోంది. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఈ ట్రోల్స్ మీద భగ్గుమంటున్నారు. తెలంగాణ హీరో అయిన విజయ్ ను కావాలనే ట్రోల్స్ చేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. ట్రోల్స్ వీడియోల కింద ఓ రేంజ్ లో తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ఇన్ని రోజులు ఏపీ హీరోలను తెలంగాణ ప్రజలు ఆదరించారని.. కానీ ఇప్పుడు తెలంగాణ నుంచి ఒకే ఒక్కడు స్టార్ హీరోగా ఎదుగుతుంటే ఓర్చుకోలేక కావాలని టార్గెట్ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ సినీ అభిమానులు. విజయ్ ఎవరినీ ఎప్పుడూ ఏమీ అనలేదని.. అలాంటి వ్యక్తిని ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

ఒక వ్యక్తి సొంతంగా ఎదిగితే అందరం ప్రోత్సహించాలి గానీ.. ఇలా కావాలని టార్గెట్ చేస్తుంటే.. రేపు పొద్దున ఎవరైనా ఇండస్ట్రీలో ఎదుగుతారా అని అడుగుతున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ సినీ ప్రేక్షకులు విజయ్ దేవరకొండకు ఇలా సపోర్టుగా రాలేదు. కానీ ఇప్పుడు ఇలా ఆయనకు అండగా మారడం అంటే.. ఆయనకు ఇక తిరుగుటేనట్టే అంటున్నారు. ఈ హీరో అభిమానులు.. ఆ హీరో అభిమానులు అనే తేడాలు లేకుండా.. తెలంగాణ సినీ ప్రేక్షకులు మొత్తం విజయ్ దేవరకొండకు అండగా నిలుస్తున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News