Vijay Deverakonda : ప్రభాస్, మహేశ్ లాంటి స్టార్లు ఉన్నా.. విజయ్ దేవరకొండనే అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతున్నారు..?

Qubetvnews - February 17, 2024 / 07:27 AM IST

Vijay Deverakonda : ప్రభాస్, మహేశ్ లాంటి స్టార్లు ఉన్నా.. విజయ్ దేవరకొండనే అమ్మాయిలు ఎందుకు ఇష్టపడుతున్నారు..?

Vijay Deverakonda :

ఇప్పుడు విజయ్ దేవరకొండ సెల్ఫ్‌ మేడ్ స్టార్ అయిపోయాడు. ఆయన పేరు ఇప్పుడు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లో కూడా బాగానే వినిపిస్తోంది. ఆయన చేస్తున్న సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. కాగా విజయ్ దేవరకొండకు యూత్ లో అందులోనూ అమ్మాయిల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఏ హీరోలకు లేనంత క్రేజ్ కేవలం విజయ్ కు మాత్రమే అమ్మాయిల్లో ఉంది. విజయ్ పేరు చెబితే అమ్మాయిలు పిచ్చెక్కిపోన్నారు. విజయ్ పేరును గుండెల మీద పచ్చబొట్టు కూడా వేయించుకునేంతలా విజయ్ మైకంలో తేలిపోతున్నారు.

బెల్లం చుట్టూ ఈగల్లా విజయ్ చుట్టూ అమ్మాయిలు వాలిపోతున్నారు. మరి విజయ్ దేవరకొండ చుట్టూ ఇంతగా అమ్మాయిలు ఎందుకు వాలిపోతున్నారు. విజయ్ కు పెద్దగా డ్యాన్స్ లు కూడా రావు. పైగా ఆరడుగుల కటౌట్ కూడా కాదు. ఇండస్ట్రీలో ప్రభాస్, బన్నీ, మహేశ్ లాంటి అందమైన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ వారందరినీ కాదని విజయ్ చుట్టూ అమ్మాయిలు చేరిపోతున్నారు. మామూలు అమ్మాయిలు మాత్రమే కాదండోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా విజయ్ తో ఒక్క ఛాన్స్ ప్లీజ్ అనేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు అయిన కియారా, జాన్వీకపూర్, సారా అలీఖాన్ లాంటి వారు కూడా విజయ్ తోనే డేటింగ్ కు వెళ్తామని బహిరంగంగానే చెప్పేస్తున్నారు.

మరి ఇంతగా విజయ్ చుట్టూ హీరోయిన్లు, అమ్మాయిలు ఎందుకు వాలిపోతున్నారు అంటే అది విజయ్ కు ఉన్న ఆటిట్యూడ్. అవును ఇప్పటి వరకు విజయ్ లాంటి యాటిట్యూడ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో లేరు. పైగా ఈ తరం జనరేషన్ కు సాఫ్ట్ గా ఉంటే అస్సలు నచ్చదు. రఫ్ గా ఉండాలి.. బోల్డ్ గా ఉండాలి. పైగా యాటిట్యూడ్ ను కాస్త ఎక్కువగానే చూపించాలి. పైగా కత్తిలాంటి బాడీ ఉండాలి. అప్పుడే అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంటారు. ఇప్పుడు విజయ్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. విజయ్ చుట్టూ అమ్మాయిలు కూడా ఇందుకే చేరుతున్నారు.

అతని యాటిట్యూడ్ అమ్మాయిలకు బాగా నచ్చేస్తోంది. పైగా విజయ్ లాంటి యాటిట్యూడ్ ఉన్న హీరోలు ఇండస్ట్రీలో లేరు. అందుకే విజయ్ పేరును అమ్మాయిలు జపం చేస్తున్నారు. కాగా విజయ్ కూడా ఆ లేడీ ఫ్యాన్ బేస్ ను కాపాడుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గానే ఖుషి సినిమాతో ఓ మాదిరి హిట్ అందుకున్నాడు. దాని తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా మీద ఫోకస్ పెట్టాడు విజయ్. ఈ సినిమాపై చాలానే అంచనాలు ఉన్నాయి. పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను ఎంత మంది ఆదరిస్తారనేది వేచి చూడాల్సిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News