YouTuber Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

Qubetvnews - February 22, 2024 / 12:41 PM IST

YouTuber Shanmukh Jaswanth : గంజాయితో పట్టుబడ్డ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

YouTuber Shanmukh Jaswanth :

టాలీవుడ్ లో గంజాయి కలకలం రేగింది. యూట్యూబ్ స్టార్ అయిన షణ్ముఖ్ జశ్వంత్ ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితో పట్టుబడటంతో ఆయనతో పాటు ఆయన సోదరుడిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ వార్త టాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. వాస్తవానికి పోలీసులు ఓ కేసు ఛేజింగ్ కోసం షన్ముఖ్ ఇంటికి వెళ్లారు. కానీ అక్కడ గంజాయితో షణ్ముఖ్‌ కనిపించడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

అసలు విషయం ఏంటంటే షణ్ముఖ్ అన్న అయిన సంపత్ వినయ్ తనను మోసం చేశాడని మోనిక అనే అమ్మాయి కేసు పెట్టేసింది. ఆరు రోజుల్లో తమ పెళ్లి పెట్టుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటూ మోనిక కేసు నమోదు చేసింది.

దాంతో సంపత్ వినయ్ ను అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ లోని షణ్ముఖ్ ప్లాట్ కు పోలీసులు వెళ్లారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత షణ్ముక్ సోదరులు గంజాయితో పట్టుబడ్డారు. దీంతో అన్నా, తమ్ముడు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News