Amala Akkineni : నాగచైతన్యను నేను పెంచలేదు.. అతను అఖిల్ లాంటి వ్యక్తి కాదు.. అమల షాకింగ్ కామెంట్లు..!

Qubetvnews - February 17, 2024 / 07:00 AM IST

Amala Akkineni : నాగచైతన్యను నేను పెంచలేదు.. అతను అఖిల్ లాంటి వ్యక్తి కాదు.. అమల షాకింగ్ కామెంట్లు..!

Amala Akkineni :

సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక క్రేజ్ ఉంది. ఎందుకంటే అక్కినేని నాగేశ్వర్ రావు అప్పట్లో ఇండస్ట్రీని ఏలాడు. ఆయన తర్వాత నాగార్జున కూడా స్టార్ హీరోగా బాగానే రాణించాడు. ఆయన ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన కొడుకులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇంకా స్టార్ హీరోలు కాలేకపోయారు. కానీ వీరిద్దరిలో నాగచైతన్య మంచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం తండేల్ సినిమాలో షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే నాగచైతన్య తల్లి లక్ష్మీ అని అందరికీ తెలిసిందే. నాగార్జున మొదటి భార్యనే లక్ష్మీ.

వీరిద్దరికీ పుట్టిన వ్యక్తి నాగచైతన్య. అయితే లక్ష్మీతో విడిపోయిన తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున. వీరిద్దరికీ అఖిల్ పుట్టాడు. కాగా సవతి తల్లి అయిన అమలతో నాగచైతన్యకు పెద్దగా బాండింగ్ ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే వీరిద్దరూ ప్రత్యేకంగా దిగిన ఫొటోలు ఒక్కటి కూడా ఎన్నడూ కనిపించలేదు. ఏదో ఫ్యామిలీ ఈవెంట్లు, ఫంక్షన్లలో మాత్రమే గ్రూప్ ఫొటోలో ఇద్దరూ కనిపిస్తారు. దాంతో వీరిద్దరి నడుమ సంబంధాలు ఎలా ఉ న్నాయనేది తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కాగా తాజాగా అమల దానిపై స్పందించారు.

 అమల  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో ఆమె మాట్లాడుతూ నాగచైతన్య చిన్నప్పుడు వాళ్ల అమ్మ దగ్గరే పెరిగాడు. అప్పుడప్పుడు నాగార్జున వద్దకు వస్తుండేవాడు. వచ్చినప్పుడల్లా నాగార్జునతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. అఖిల్ తో చైతన్యకు మంచి బాండింగ్ ఉంది. చిన్నప్పుడు చైతన్య ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురు చూసేవాడు. చైతన్య వెంటే అఖిల్ తిరిగేవాడు. చైతన్య చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయి. చైతన్య కాస్త సెన్సిటివ్ గా ఉండేవాడు. అఖిల్ లాగా హైపర్ యాక్టివ్ మాత్రం కాదు. చైతన్య, అఖిల్ సినిమాలు వస్తున్నాయంటే నాకు గుండెల్లో దడగా ఉంటుంది.

కానీ సినిమాల ఫలితాలను రెండు రోజుల్లో మర్చిపోయి కొత్త ప్రాజెక్టుపై దృష్టి పెడుతుంటారు ఇద్దరూ కూడా. అదే వారిలో నాకు బాగా నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు అమల. ఆమె చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే చైతన్యతో అమలకు పెద్దగా బాండింగ్ లేదని అర్థం అవుతోంది. కానీ అఖిల్ తో మాత్రం ఇద్దరికీ మంచి బాండింగ్ ఉన్నట్టు చెబుతున్నారు.

Amala Akkineni Comments On Naga Chaitanya

Amala Akkineni Comments On Naga Chaitanya

ఇక ప్రస్తుతం నాగచైతన్య నాగార్జునతో కలిసి ఉండట్లేదని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఒంటరిగా వేరే చోట ఉంటున్నారంట. ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఆయన దృష్టి పెడుతున్నారు. ఇక నాగచైతన్య చాలా కాలం తర్వాత తండేల్ లాంటి డిఫరెంట్ సినిమాను చేస్తున్నాడు. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News