Health Tips : ఉదయాన్నే బొప్పాయి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Qubetvnews - February 17, 2024 / 11:08 AM IST

Health Tips : ఉదయాన్నే బొప్పాయి తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

Health Tips :

చాలా మందికి పండ్లు తింటే వచ్చే ప్రయోజనాల గురించి తెలియదు. వాస్తవానికి రెగ్యులర్ గా పండ్లు తింటే మనం డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు కాబోలు. కొన్ని రకాల పండ్లను తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. అయితే ఇలాంటి వాటిలో బొప్పాయి అన్నింటికంటే మేలు అనే చెప్పుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి పండును తినడం వ్లల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని మలబద్ధకం సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్-సి ఉంటుంది.

మన బాడీకి విటమిన్-సి అనేది ఎంతో అవసరం. అయితే ఇది బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా సూపర్ ఫుడ్ గా మన బాడీకి పనిచేస్తుంది. ఇందులో విటమిన్‌-సితో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఇ., ఫోలేట్, మెగ్నీషియం, ఫోలేట్, పొటాషియం , కాపర్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మనం తినే భోజనంలో ఉండే పోషకాలను మన బాడీకి అందేలా సాయపడుతాయి. అంతే కాకుండా తిన్న ప్రతి ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చూస్తుంది బొప్పాయి పండు. ఇంకా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో చూద్దాం.

పోషక శోషణ…

బొప్పాయి పండును తీసుకోవడం వల్ల మన బాడీకి పోషకాలు కావాల్సినంత అందిస్తుంది. కాబట్టి మనం భోజనం చేసిన తర్వాత రెండు గంటలకు బొప్పాయి పండును తీసుకుంటే ఇందులోని పోషకాలు మరింత సమర్ధవంతంగా శోషించబడతాయి. మిగతా ఆహారాలు ప్రాసెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి బొప్పాయిని తీసుకోవాలి.

జీర్ణక్రియ సౌలభ్యం…

బొప్పాయి పండును తినడం వల్ల జీర్ణ క్రియ ఎంతో బాగా పని చేస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ లాంటి ఎంజైమ్ లు జీర్ణక్రియ కార్యకలాపాలు తగ్గినప్పుడు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి. అంతే కాకుండా ప్రోటీన్ లు జీర్ణక్రియ పెంచేందుకు సాయంచేస్తాయని చెప్పుకోవాలి.

చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది…

ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే మనం బొప్పాయిని తీసుకోవడం వల్ల ఇలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత బొప్పాయిని తీసుకుంటే మన రక్తంలో చెక్కర స్థాయిలను బొప్పాయి కంట్రోల్ చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

బరువు పెరుగుతారనే భయం లేదు…

చాలా మందికి కొంచెం ఆహారం ఎక్కువగా తీసుకున్నా బరువు పెరుగుతామనే భయం ఉంటుంది. కానీ బొప్పాయితో ఇలాంటివి దూరం చేసుకోవచ్చు. బొప్పాయిని తినడం వల్ల రోజంతా మనకు కడుపు నిండుగా ఉంటుంది. దాంతో ఆకలి వేయదు. భోజనం చేయడానికి రెండు గంటల ముందు బొప్పాయిని తినడం వల్ల ఆకలి వేయదు. కాబట్టి ఈజీగా బరువు తగ్గేందుకు అవకాశాలు ఉంటాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News