BRS : ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఆ పార్టీ గత పదేండ్లు అధికారంలో ఉండి.. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయింది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఆ పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీని ఎవరూ పట్టించుకోవట్లేదు. అంతే కాకుండా ఇప్పటికే వరుసగా ఎమ్మెల్యేలంతా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. దాదాపు 12 మంది ఇప్పటికే పార్టీ కండువాలు మార్చేశారు. ఇంకో 16 […]