Mangli : సింగర్ మంగ్లీకి పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె కారును వెనక నుంచి డీసీఎం ఢీ కొట్టగా.. ఆమెతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం […]