Siddham Sabha : వైసీపీ ఎన్నికల కోసం అన్ని విధాలుగా సిద్ధం అవుతోంది. ఇప్పటికే జగన్ వరుసగా అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తున్నారు. దానికి తోడు ఇటు ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లేందుకు సిద్ధం సభను నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే వైసీపీకి జనాల్లో ఇంకా పట్టు పెరిగిందని కామెంట్లు చేస్తున్నారు వైసీపీ నేతలు. దీనికి సిద్ధం సభలకు వస్తున్న జనాలు సాక్ష్యం అని చెబుతున్నారు. మొన్న భీమిలిలో సిద్ధం మొదటి సభను పెట్టి జగన్ సక్సెస్ […]