Kasani Gnaneshwar Mudhiraj : కాంగ్రెస్ కి బుద్ది చెప్పేందుకు చేవెళ్ల ఓటర్లు సిద్ధంగా ఉన్నారు
Qubetvnews - May 3, 2024 / 10:19 AM IST
Kasani Gnaneshwar Mudhiraj :
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీసీల బలం ప్రభుత్వంకు చూపించేందుకు కాసానిని గెలిపించాలంటూ ఓటర్లకు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా పలు అసెంబ్లీ సెగ్మెంట్‌లలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి జనాలతో మమేకం అవుతున్న కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసాని తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంకా పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ… రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్లినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులనుని గెలిపించాలని మాకంటే ప్రజలకే కోరిక ఎక్కువగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయాం, ఇప్పుడు మోసపోయేదే లేదని ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు చేవెళ్ల ఓటర్లు సిద్ధంగా ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.

BRS Party Leaders Are Appealing Voters Let Kasani Gnaneshwar Mudhiraj Win
పదేళ్ల కేసీఆర్ పాలనలో కులవృత్తులను ఆదుకోవడమే కాక, ప్రతి రైతుకు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, 24 గంటల నాణ్యమైన కరెంటు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 5 నెలల్లో తెలంగాణాలో పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధం అయ్యింది. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతామని ఒక మంత్రి అంటుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తాను సీఎం అనే విషయం మరిచి పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అంటాడు.
బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు కేసీఆర్ అంటే భయం, ఓటమి భయంతో 48 గంటలు ఆయన మాట్లాడవద్దని నిషేదించారు. కేసీఆర్ మాట్లాడకపోయినా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఒక కేసీఆర్ లా ఎన్నికల్లో కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత ప్రజలతో మమేకమై 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా, 5 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉంది.

BRS Party Leaders Are Appealing Voters Let Kasani Gnaneshwar Mudhiraj Win
ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి అవుతుంది అన్నారు. బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా ఎంపీలుగా ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకు రాలేక పోయారు. ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి కి కాంగ్రెస్, బీజేపీ లు ఏం చేశాయో చెప్పాలని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం పార్లమెంట్ లో కొట్లాడతానని కాసాని ఓటర్లకు హామీ ఇచ్చారు.
