KTR : కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించేలా కేటీఆర్ వ్యాఖ్యలు.. ఇంత ప్లాన్ ఉందా..?

Qubetvnews - April 3, 2024 / 09:57 AM IST

KTR : కాంగ్రెస్ లో కల్లోలం సృష్టించేలా కేటీఆర్ వ్యాఖ్యలు.. ఇంత ప్లాన్ ఉందా..?

KTR : బీఆర్ ఎస్ కు ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచే ఈ కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవాలి. అప్పటి నుంచే పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోవడం స్టార్ట్ అయింది. కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు, ఇటు కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కావడం దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, భూ కబ్జా కేసులు.. ఇలా అన్నీ ఒకేసారి మెడకు చుట్టుకుంటున్నాయి. దాంతో ఇప్పుడు పార్టీ గ్రాఫ్ క్రమంగా పడిపోతూనే ఉంటుంది. ఈ వంక చూపించి బీఆర్ ఎస్ నేతలు అందరూ కాంగ్రెస్ బాట పడుతున్నారు. కాంగ్రెస్ లోకి అందరూ వలసలు వెళ్లిపోతున్నారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు దాదాపు వెళ్లిపోయారు. టికెట్లు ఇస్తామన్నా సరే ఎవరూ ఉండట్లేదు. దాంతో పాటు అటు బీఆర్ ఎస్ మాజీ మంత్రులు, సీనియర్ నేతలు కూడా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గానే కడియం, కేకే వెళ్లిపోవడం పార్టీని తీవ్రంగా నష్టపరిచింది. వారిద్దరి తర్వాత చాలా మంది వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు సంచలన కామెంట్లు చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని బీఆర్ ఎస్ కూల్చాలని అనుకోవట్లేదని తెలిపారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నేతలే పడగొడుతారంటూ చెబుతున్నారు.

కాంగ్రెస్ లోనే ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని.. ఖమ్మం, నల్గొండ నేతలే రేవంత్ రెడ్డిని దింపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ లో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు గందరగోళం రేపుతున్నాయి. అయితే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక చాలా లోతైన అర్థం ఉన్నట్టు తెలుస్తోంది. అదేంటంటే.. ఖమ్మం, నల్గొండ నుంచే కాంగ్రెస్ కు బలమైన ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. కీలక నేతలంతా ఇక్కడి నుంచే ఉన్నారు. వారంతా మొదటి నుంచే రేవంత్ ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడి నేతలకు మంత్రి పదవులు ఇచ్చారు.

దాంతో వారంతా ఇప్పుడు రేవంత్ కు మద్దతు తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ లో అలజడి రేపితే బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ మీదకు ప్రజల్లో అటు మీడియాలో చర్చ జరుగుతుందని కేటీఆర్ భావించి ఉండవచ్చు. అందుకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని అనుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు.

కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశాక కచ్చితంగా రేవంత్ వర్గంలో ఆందోళన మొదలవుతుంది. అది కాస్తా రెండు గ్రూపుల మధ్య గొడవలకు దారి తీసిందంటే కచ్చితంగా కేటీఆర్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే అవుతుంది. అప్పుడు బీఆర్ ఎస్ మీద కాంగ్రెస్ దృష్టి పెట్టకపోవచ్చు. మరి కేటీఆర్ ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Telangana in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News