Telangana Press Academy Chairman: ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి క్యూబ్ టీవీ తరఫున అభినందనలు..!
Qubetvnews - February 26, 2024 / 07:41 PM IST
Telangana Press Academy Chairman: తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. నిన్న ఆదివారమే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీ హనుమంతరావు జారీ చేశారు. దాంతో శ్రీనివాస్ రెడ్డికి ఇటు జర్నలిస్టుల నుంచి మాత్రమే కాకుండా అటు రాజకీయ నాయకుల నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి.

ఇప్పటికే చాలా మంది ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తాజాగా సోమవారం నాడు కూడా జర్నలిస్టులు కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. క్యూబ్ టీవీ ప్రతినిధి, సీనియర్ జర్నలిస్టు శ్రావణి గారు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు శ్రావణిగారు. శ్రీనివాస్ రెడ్డి తమకు గురువు లాంటి వారని జర్నలిస్టు శ్రావణి తెలియజేశారు.

శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం ఎడిటర్ గా ఉన్నారు. ఆయన గతంలో విశాలాంధ్ర, మనతెలంగాణ పత్రిలకలకు ఎడిటర్ గా కూడా పని చేశారు. ఉమ్మడి ఏపీలో మొదటిసారి ప్రెస్ అకాడమీ ఏర్పడ్డప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ గా చేశారు.