Cm Chandrababu : సామాన్యులకు పెద్దపీట.. 99 మందికి నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం..

Qubetvnews - September 24, 2024 / 03:27 PM IST

Cm Chandrababu : సామాన్యులకు పెద్దపీట.. 99 మందికి నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం..

Cm Chandrababu :  కూటమి ప్రభుత్వం మరోసారి ఔన్నత్యాన్ని చాటుకుంది. కూటమిలో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే పార్టీలో పదవులు అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది ఏంటంటే.. డబ్బున్న వాళ్లకే ఇస్తారని అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు కట్టబెట్టింది. ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రత్యేకతను చాటుకున్నారు చంద్రబాబు నాయుడు. డబ్బు, బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి కాకుండా.. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ అతి సామాన్యులకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు.

తాజాగా 99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఇందులో ఎక్కువగా బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు ఇవ్వడమంటే మాటలు కాదు. ఎంతో పెద్ద వాళ్లు పోటీ పడుతున్నా సరే వారందరినీ కాదని.. వీళ్లకే పదవులు ఇచ్చింది. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఏకంగా ఛైర్మెన్ పదవి కూడా ఇచ్చింది. ఆరుగురు యూనిట్ ఇన్ చార్జులకు పదవులు అప్పగించింది. 20 కార్పొరేషన్లకు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యుల పదవులకు అతి సామాన్య కార్యకర్తలను ఉంచింది.

ప్రకటించిన 99 పదవుల్లో చూసుకుంటే ఎక్కువగా యూత్ కు ఇంపార్టెన్స్ ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య
యూత్ కు పదవులు కట్టబెట్టింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు ఇలా సామాన్యులకు పదవులు కట్టబెట్టడం వెనక ఎంతో చాకచక్యం ఉందంటున్నారు. ఎందుకంటే గత ఐదేండ్లలో చంద్రబాబు వెంట సామాన్య కార్యకర్తలే నడిచారు. వారే పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుంటే.. చంద్రబాబు గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన ఎంతో మంది సైలెంట్ గా ఉండిపోయారు.

అందుకే ఈ సారి చంద్రబాబు వారందరినీ కాదని ఎవరైతే నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డారో వారికే గుర్తింపు ఇచ్చారు. ఇది నిజంగా చాలా ప్రశంసనీయం అనే చెప్పుకోవాలి. ఇలా చేసినప్పుడే పార్టీ మీద, ఆ పార్టీ అధినేత మీద సామాన్య కార్యకర్తలకు నమ్మకం కలుగుతుంది.

తమకు కూడా గుర్తింపు లభిస్తుందని.. సామాన్యులు కూడా ఆ పార్టీలో ఎదగొచ్చనే నమ్మకంతో కార్యకర్తలు మరింత చురుగ్గా పనిచేస్తుంటారు. పైగా యూత్ కు గుర్తింపు ఇవ్వడం అనేది చంద్రబాబును మరో లెవల్ లో ఉంచుతుందని చెబుతున్నారు.99 nominated posts filled by cm chandrababu in ap state

99 nominated posts filled by cm chandrababu in ap state

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News