Ap bjp: చంద్రబాబును నమ్మని ఏపీ బీజేపీ.. సహకారం ఉండదేమో..!

Qubetvnews - March 16, 2024 / 11:57 AM IST

Ap bjp: చంద్రబాబును నమ్మని ఏపీ బీజేపీ.. సహకారం ఉండదేమో..!

Ap bjp : చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. ఏపీలో ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలని ఆయన చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పవన్ కల్యాణ్‌ తో పొత్తులు పెట్టుకున్నారు. పవన్ కూడా అక్కడికేదో తాను జగన్ ను ఓడిస్తానని.. జగన్ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఉద్దేశంతోనే చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నట్టు తెలిపారు. అంతే కాకుండా వైసీపీని గద్దె దించుతానని శపథాలు కూడా చేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇంత చేస్తున్న పవన్ కల్యాణ్‌ కు చంద్రబాబు తక్కువ సీట్లు ఇచ్చాడనే విమర్శలు జనసేన నుంచి వస్తున్నాయి.

ఇక పవన్ కల్యాణ్‌ ఎన్నో ప్రయత్నాలు చేసి ఢిల్లీ బీజేపీ పెద్దల వద్ద చీవాట్లు తిని మరీ కూటమిలో భాగస్వామ్యం చేశారని జనసేన చెబుతోంది. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్‌ ఎంతో త్యాగాలు చేసి మరీ పొత్తులు కుదిర్చారు. ఇక బీజేపీ కోసం చంద్రబాబు 10 ఎమ్మెల్యే సీట్లు, ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు. అయితే ఈ పొత్తులు మాత్రం ఏపీ బీజేపీ నేతలను కలవకుండానే డైరెక్టుగా కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడి ఓకే చేసుకున్నారు. దాంతో ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు మీద వారు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏకంగా కొందరు ఏపీ బీజేపీ నేతలు జేపీ నడ్డాకు లేఖ కూడా రాశారు. ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో విష్ణువర్థన్ రెడ్డి, శాంతారెడ్డి, మాలతీరాణి, దయాకర్ రెడ్డి, పాకా సత్యానారాయణ తదితరులు ఉన్నారు. వీరందరూ చంద్రబాబును నమ్మొద్దంటూ కోరారు. అంతే కాకుండా అసలు ఏపీ బీజేపీకి ఇచ్చిన పది సీట్లు కూడా అసలు బీజేపీకి ఏ మాత్రం పట్టు లేని గెలిచే అవకాశాలు లేని నియోజకవర్గాలు అంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ గానీ, బీజేపీ గానీ ఏ మాత్రం పట్టు సాధించలేకపోయాయని.. అలాంట నియోజకవర్గాలను కేటాయించారంటూ చెబుతున్నారు.

అంతే కాకుండా ఏపీ బీజేపీ నేతలు తమ పార్టీలో కీలకంగా పని చేస్తున్న కొందరి పేర్లతో జాబితాను రెడీ చేసి పంపించినా సరే వాటిని చంద్రబాబు పక్కన పెట్టేసి తనకు నచ్చిన విధంగా సీట్లను కేటాయించారంటూ ఆరోపిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. కాబట్టి చంద్రబాబు మాయలను నమ్మొద్దంటూ వారు వేడుకుంటున్నారు.

మొత్తానికి ఇప్పుడే ఏపీ బీజేపీ నేతలు ఇలా విమర్శలు, ఆరోపణలు చేస్తుంటే.. రేపు ఎన్నికల్లో టీడీపీ నేతలు పోటీ చేసే చోట బీజేపీ నేతలు సహకారం అందించే పరిస్థితులు అయితే ఉండవని చెబుతున్నారు ఏపీ బీజేపీ నేతలు. కచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలే ఉంటాయంటున్నారు రాజకీయ వర్గాలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News