Atmasakshi survey : ఆత్మసాక్షి సర్వే రిపోర్టు.. ఎగిరేది వైసీపీ జెండానే..!
Qubetvnews - April 16, 2024 / 09:04 PM IST
Atmasakshi survey : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ చాలా సర్వేలు బయటకు వస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో సర్వేలు చాలా ప్రభావితం చేస్తుంటాయి. ఎందుకంటే ఏపార్టీ గెలుస్తుందనే విషయంపై మెజార్టీ సర్వేలు నిజమే చెబుతుంటాయి. అందుకే సర్వేల ఫలితాలను బట్టి పార్టీలు కూడా ప్లాన్లు మార్చుకుంటాయి. ఇప్పుడు ఏపీలో ఇప్పటికే చాలా సర్వేలు చేశాయి. అందులో చెప్పుకోదగ్గది ఆత్మసాక్షి సర్వే. ఇప్పటికే మూడు రౌండ్లు సర్వేపూర్తి చేసిన ఈ సంస్థ ఇప్పుడు తాజాగా నాలుగో రౌండ్ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఇందులో మరోసారి వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని తెలిపింది ఈ సర్వే.
ఇందులో భాగంగా వైసీపీకి 97 నుంచి 118 సీట్లు వస్తాయని ఈసర్వే ప్రకటించింది. దాంతో రెండోసారి జగన్ ప్రభుత్వమే ఏపీలో కొలువుదీరబోతుందని సర్వే స్పష్టం చేసింది. అటు అధికారంపై ఎన్నో ఆశలుపెట్టుకున్న టీడీపీ కూటమికి ఈ సర్వేలో కూడా షాక్ తగిలింది. టీడీపీ కూటమికి 54 నుంచి 62 సీట్లు మాత్రమే వస్తాయని స్పష్టం చేసింది ఈ సర్వే. ఇక జిల్లాల వారీగా కూడా వైసీపీకే మెజార్టీ స్థానాలు దక్కుతున్నాయి. శ్రీకాకుళలంలో 5 సీట్లలో వైసీపీ గెలిస్తే కూటమి 3 సీట్లలో కూటమి గెలుస్తుందని, రెండు సీట్లలో గట్టి పోటీ ఉంటుందని చెప్పింది.
అటు విజయనగరంలో చూసుకుంటే వైసీపీకి 7, కూటమికి 2 వస్తాయని చెప్పింది. విశాఖపట్నంలో వైసీపీకి 6, టీడీపీకి 6 వస్తాయని, పశ్చిమ గోదావరిలో వైసీపీకి 9 సీట్లు, టీడీపీ కూటమికి 7 సీట్లు వస్తాయని, 3 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. తూర్పు గోదావరిలో 8 వైసీపీకి, 5 టీడీపీ కూటమికి, 2 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని, అటు కృష్నాలో 10 వైసీపీకి, 5 కూటమికి వస్తాయని, 1 సీటులో టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పింది. గుంటూరులో 7 వైసీపీకి, కూటమికి 8 సీట్లు, 2 సీట్లలో టప్ ఫైట్, అటు ప్రకాశంలో 5 వైసీపీకి, 4 కూటమికి, 3 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది సర్వే. నెల్లూరులో వైసీపీకి 5, కూటమికి 4, 1సీటులో గట్టి పోటీ ఉంటుందంట.
ఇటు కడపలో 8 వైసీపీకి కూటమికి 1, ఒక సీటులో గట్టి పోటీ ఉంటుందని సర్వే చెబుతోంది. కర్నూలులో వైసీపీకి 10, కూటమికి 2, 2 చోట్ల టప్ ఫైట్, అనంతపురంలో 9 వైసీపీకి, 2 కూటమికి, 3 చోట్ల గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. చిత్తూరులో వైసీపీకి 8, కూటమికి 2 వస్తాయని, రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంటుందని తెలిపింది ఈ సర్వే.
అటు ఎంపీ సీట్లలో కూడా వైసీపీదే హవా సాగుతోంది. వైసీపీకి 16 నుంచి 18 సీట్లు వస్తాయని, కూటమికి 6 నుంచి 7 సీట్లు మాత్రమే వస్తయాని సర్వే చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కొంత మెజార్టీ తగ్గవచ్చు గానీ.. ఏపీ మొత్తంలో ఎగిరేది వైసీపీ జెండానే అని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
