Atmasakshi Survey : ఆత్మసాక్షి తాజా సర్వే.. ఏపీలో జగన్ కు తిరుగులేదంతే..!
Qubetvnews - May 5, 2024 / 09:22 PM IST
Atmasakshi Survey : సర్వే ఏదైనా జగన్ దే విజయం.. ఏ సంస్థ వచ్చి సర్వే చేసినా జగన్ కు పట్టం.. గత కొన్ని రోజులుగా ఏపీలో సాగుతున్న తంతు ఇదే. ఏపీలో ఎన్నికల సమరం జోరుగానే సాగుతోంది. ఇలాంటి సమయంలో ఏపీలో ఎవరు గెలుస్తారనే కుతూహలం అందరికీ ఉంది. ఎందుకంటే ఈ సారి పోటీ తత్వం మరీ ఎక్కువగా ఉంది. జగన్ సింగిల్ గానే వస్తుంటే… అటు టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం కూటమిగా ఏర్పడ్డాయి. వాటితో పాటు అటు కాంగ్రెస్ కూడా వామపక్షాలతో కలిసి కూటమిగా ఏర్పడింది. ఇలా అన్ని పార్టీలు కూటములుగా వస్తుంటే జగన్ మాత్రం సింగిల్ గానే వస్తున్నారు.
ఈ క్రమంలోనే జగన్ కు ఓటమి తప్పదని పదే పదే ప్రతిపక్షాలన్నీ సవాల్ చేస్తుంటే సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నాయి. అన్ని సర్వేల్లో జగనే గెలుస్తారని చెబుతున్నారు. తాజాగా ఆత్మసాక్షి గ్రూప్ ఐపీఎస్ ఎస్ హైదరాబాద్ సంస్థ చేసిన సర్వేలో జగన్ మరోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తారని ఈ సర్వే తేల్చేసింది. స్పష్టమైనా మెజార్టీతోనే గెలుస్తున్నట్టు కుండ బద్దలు కొట్టేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఏకంగా 48.5 శాతం ఓటింగ్ వస్తుందని చెప్పింది ఈ సర్వే. అటు టీడీపీ కూటమికి మాత్రం 46 శాతం ఓట్లు వస్తాయని తేల్చి చెప్పింది.
ఇక ఇతరులకు 3.5 శాతం ఓటింగ్ వస్తుందని చెప్పేసింది ఈ సర్వే. వైసీపీకి 95 నుంచి 113 సీట్లు వస్తాయని గతంతో పోలిస్తే సీట్లు తగ్గుతాయని చెప్పేసింది. ఇక టీడీపీ కూటమికి మాత్రం 54 నుంచి 62 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. టీడీపీ ఈ సారి అధికారం తమదే అని ఎంత చెబుతున్నా సరే… ఈ సారి మాత్రం టీడీపీ కూటమికి అధికారం దక్కదని ఈ సర్వే మరోసారి తేల్చి చెప్పింది. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు ఎక్కువగా వైసీపీకి పడుతున్నాయని సర్వే తెలిపింది. రాయలసీమలో 35 సీట్లు వైసీపీకి వస్తే, టీడీపీ కూటమికి మాత్రం కేవలం 9 సీట్లే వస్తాయని తెలిపింది ఈ సర్వే. 8 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది.
అటు దక్షిణ ఏపీలో అంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్నా జిల్లాలో కలిపి వైసీపీకి 25 సీట్లు వస్తే, టీడీపీ కూటమికి మాత్రం 21 సీట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది ఈ సర్వే. ఇక్కడ కూడా 9 సీట్లలో గట్టి పోటీ ఉంటున్నట్టు చెప్పింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో 16 సీట్లలో వైసీపీ గెలిస్తే, టీడీపీ కూటమికి మాత్రం 12 సీట్లే వస్తాయని తేల్చింది. 6 సీట్లలో గట్టి పోటీ ఉంటున్నట్టు చెప్పింది.
ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే 19 సీట్లు వైసీపీకి వస్తే, టీడీపీ కూటమికి మాత్రం 12 సీట్లే వస్తాయని చెబుతోంది. మిగిలిన 3 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని చెప్పింది. ఇలా అన్ని జిల్లాల్లో వైసీపీకే మెజార్టీ సీట్లు వస్తాయని చెబుతోంది ఈ సర్వే.
