Chalamalasetty Sunil : చలమలశెట్టి సొంత మేనిఫెస్టోతో దేశంలోనే నెం.1 గా కాకినాడ

Qubetvnews - May 12, 2024 / 10:37 AM IST

Chalamalasetty Sunil : చలమలశెట్టి సొంత మేనిఫెస్టోతో దేశంలోనే నెం.1 గా కాకినాడ

Chalamalasetty Sunil :

కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గ వైకాపా అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గెలుపు ఖాయం అంటూ పలు సర్వేల్లో వెళ్లడి అయ్యింది. చివరి రోజు వరకు సునీల్ ప్రచారంలో దూకుడు కనబర్చారు. ప్రచారంలో చివరి రోజు అయిన శనివారం చలమలశెట్టి సునీల్ గెలుపు కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని పిఠాపురం అసెంబ్లీ సెగ్మెంట్‌ లో సీఎం జగన్‌ ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అంటూ పిలుపునిచ్చారు. కూటమి పేరుతో మాయ మాటలు చెప్పి, సంక్షేమ పథకాలను అడ్డుకునే వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు.

పారిశ్రామిక వేత్త అయిన చలమలశెట్టి సునీల్‌ గెలుపుతోనే కాకినాడ అభివృద్ది సాధ్యం అంటూ వైకాపా నాయకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. సునీల్‌ సొంత మేనిఫెస్టో లో కాకినాడకు చెందిన పలు అంశాలను ప్రస్థావిస్తూ అభివృద్ది మరియు సంక్షేమంకు హామీలు ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఏపీలోనే 974 కిలోమీటర్ల అత్యధిక తీర ప్రాంతం ఉంది. దీన్ని సింగపూర్‌ మరియు జపాన్ ల మాదిరిగా డెవలప్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు. తీర ప్రాంతం ను అభివృద్ది చేయడం ద్వారా రాష్ట్రం అభివృద్దిలో దూసుకు పోతుందని, అందుకే తాను కేంద్రంతో కొట్లాడి అయినా తీర ప్రాతం అభివృద్దికి నిధులు తీసుకు వస్తాను అన్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాది అవకాశాలు పెరుగుతాయి. కాకినాడ సెజ్ లో అప్పటి ప్రభుత్వం 10 వేల ఎకరాలను సేకరించింది. 15 ఏళ్లు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ ఒక్క పరిశ్రమ ను కూడా ఏర్పాటు చేయలేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాను. తద్వార యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుందని సునీల్‌ అన్నారు.

కరోనా టైమ్‌ లో ఎంతో మందికి బాసటగా నిలిచిన సునీల్‌ ను గెలిపించి ఆయన మంచి మనసుకు ఓటు వేయడం ద్వారా ముందు ముందు మరిన్ని అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేస్తాడు. కాకినాడ సిటీ ని స్మార్ట్‌ సిటీగా చేసేందుకు కేంద్రం వద్ద కొట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లుగా సునీల్‌ అన్నారు. జగన్ తో కలిసి సరికొత్త ప్లాన్‌ తో కాకినాడను స్మార్ట్‌ సిటీగా మార్చుతాను అంటూ హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులు మరియు సముద్ర తీరం ను ఉపయోగించుకుని వేలాది మంది యువతకు ఉపాది కల్పించవచ్చు. ఆ దిశగా నేను ప్రయత్నిస్తాను అంటూ సునీల్‌ ఇస్తున్న హామీలకు అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి వైకాపా ను గెలిపించాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో జగన్‌ అధికారంలోకి రావడంతో పాటు వైకాపా తరపున మెజార్టీ ఎంపీలు పార్లమెంట్‌ కు వెళ్లడం ఖాయం. అందులో సునీల్ ఒక ఎంపీగా ఉండటం పక్కా అంటూ వైకాపా కార్యకర్తలు చాలా ధీమాగా ఉన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News