Chandra babu behind prashanth kishore statement : ప్రశాంత్ కిషోర్ మాటల వెనక చంద్రబాబు ఉన్నారా..?

Qubetvnews - March 4, 2024 / 09:47 AM IST

Chandra babu behind prashanth kishore statement : ప్రశాంత్ కిషోర్ మాటల వెనక చంద్రబాబు ఉన్నారా..?

Chandra babu behind prashanth kishore statement : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దాంతో అన్ని పార్టీలు ప్రచార అస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. జగన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్తున్నారు. మీకు మంచిజరిగితేనే ఓట్లేయండి అంటూ నిజాయితీగా అడుగుతున్నారు. అయితే ఇంకోవైపు చంద్రబాబు మాత్రం తన బలం సరిపోదని.. జగన్ ను ఢీ కొట్టాలంటే ఇంకా బలం కావాలంటూ పవన్ కల్యాణ్‌ తో పాటు అటు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకోవాలని చూస్తున్నారు. కాగా ఈ పొత్తులతో కూడా జగన్ ను ఓడించడం కష్టమే అని భావించారు కావచ్చు.

అందుకే ఇప్పుడు పీకేను పురమాయించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పీకే తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పీకే మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోతుంది అంటూ జోస్యం చెప్పారు. ఇదే ఇప్పుడు అందరికీ అనుమానాలు కలిగిస్తోంది. ప్రశాంత్ కిషోర్ కు వ్యూహకర్తగా మంచి పేరే ఉంది. కానీ ఆయన చెప్పినవన్నీ నిజమే అవుతాయా అంటే కాదు. ఎందుకంటే ఆయన గతంలో చాలా పార్టీలతో వ్యూహకర్తగా ఒప్పందాలు చేసుకున్నారు. కానీ ఒప్పందం కుదుర్చుకున్న అన్ని పార్టీలను గెలిపించలేకపోయారు.

ఏదేమైనా ఆయనకు ఏపీలో వైసీపీని గెలిపించిన వ్యూహకర్తగా పేరుంది. ఇప్పటికీ ఆయన టీమ్స్ ఏపీలో పని చేస్తున్నాయి. సదరు టీమ్స్ చెప్పిన సర్వే ఫలితాల ఆధారంగానే జగన్ మార్పులు, చేర్పులు చేస్తున్నారు. మరి జగన్ ఓడిపోయే అవకాశలు ఉంటే ఇప్పటికే ఈ టీమ్స్ చెప్పేవి కదా. ఇప్పటికే చాలా జాతీయ మీడియా సంస్థలు, ఇతర సంస్థలు వచ్చి సర్వేలు చేసి జగనే గెలుస్తారని తేల్చి చెప్పాయి. కాబట్టి ఇప్పట్లో జగన్ ను ఓడించడం అంటే కష్టం అని చంద్రబాబు భావించారు కాబోలు. అందుఏ ఆ మధ్య ప్రశాంత్ కిషోర్ కు ప్రత్యేక విమానం బుక్ చేసి మరీ పిలిపించుకుని భేటీ నిర్వహించారు.

తనతో కలిసి పనిచేయాల్సిందిగా కోరారని.. కానీ తాను ఇప్పుడు పార్టీలకు పని చేయట్లేదని తెలిపానని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కానీ తాజాగా ఆయన ఇలాంటి మాటలు చేయడం వెనక చంద్రబాబు మర్మం ఏదైనా ఉండి ఉండొచ్చని అంటున్నారు రాజకీయ నేతలు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఏపీలో ఎలాంటి పనులు ఇప్పుడు చేయట్లేదు.

ఆయన ఏపీ గురించి పట్టించుకోక చాలా కాలం అవుతోంది. కాబట్టి ఇప్పుడు సడెన్ గా వచ్చి ఇలామాట్లాడటం వెనకాల.. గెలిచే పార్టీకి ఓట్లేద్దామని అనుకునే ఓ సెక్షన్ ఓట్లర్లను ఇలా ప్రభావితం చేయడానికేనేమో అని అంటున్నారు రాజకీయ నిపుణులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News