Chandrababu : చంద్రబాబు, రేవంత్ భేటీపై కొత్త రకం అనుమానాలు..!

Qubetvnews - July 3, 2024 / 08:03 PM IST

Chandrababu : చంద్రబాబు, రేవంత్ భేటీపై కొత్త రకం అనుమానాలు..!

Chandrababu : కాంగ్రెస్ సీఎంగా రేవంత్ ఉన్నారు. ఎన్డీయే ముఖ్యంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీరిద్దరూ వేర్వేరు పార్టీల్లో సీఎంలుగా ఉన్నారు. కానీ అంతర్గతంగా వీరిద్దరూ అత్యంత సన్నిహితులు. ఇంకా చెప్పాలంటే గురు, శిష్యులు. ఇక ఇద్దరూ సీఎంలు అయిన తర్వాత మొదటిసారి కలుసుకోబోతున్నారు. కాదు కాదు భేటీ కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అనేక విభజన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకుందామని.. మాట్లాడుకుందామని చంద్రబాబు రేవంత్ కు ఆహ్వానం పంపారు. దాన్ని మన్నించి రేవంత్ కూడా జులై 6న ప్రజా భవన్ లో భేటీ అవుదామని చెప్పారు.

అయితే ఇరువురి భేటీలో కేవలం రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై చర్చలు సాగుతాయని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం మరో రకం చర్చ మొదలైంది. అదేంటంటే.. గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 2015లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు ఈ ఆగస్టులో సుప్రీం కోర్టులో హియరింగ్ కి వస్తోందని అంటున్నారు. అప్పట్లో టీడీపీ నేతగా ఉన్న రేవంత్ ఇందులో కీలక వ్యక్తి. అలాగే బ్రీఫ్డ్ మీ అని అప్పట్లో చంద్రబాబు వాయిస్ తో ఒక స్వరం వినిపించింది. ఈ కేసు విచారణ ఇప్పుడు సుప్రీంలో వచ్చే నెలలో విచారణకు రాబోతోంది.

అందులో కీలక మైన తీర్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ కేసు నేపథ్యంలోనే వీరిద్దరూ భేటీ అవుతున్నారంటూ కొత్త రకం ప్రచారం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో చంద్రబాబు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఏది చెప్పినా సరే మోడీ ప్రభుత్వం చేయాల్సిందే. కాబట్టి ఈ కేసు విషయాలు ఇప్పుడు వీరిద్దరి భేటీలో ఎంతో కొంత చర్చకు వస్తాయని అంటున్నారు. అందుకే ఈ భేటీకి ఇతర మంత్రులను తీసుకు వెళ్లట్లేదని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అంటే బీజేపీకి బద్ధ శత్రువు అయిన పార్టీ అన్నమాట.

కాబట్టి రేవంత్ విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు పాగా వేయాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలో రేవంత్ ఓటుకు నోటు కేసు విషయంలో ఎన్డీయే ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనేది చంద్రబాబు చేతుల్లోనే ఉందని చెబుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News