Chandrababu : చంద్రబాబుకు ఏంటీ దుస్థితి.. ఓటమి భయం మొదలైందా..?

Qubetvnews - March 26, 2024 / 06:20 PM IST

Chandrababu : చంద్రబాబుకు ఏంటీ దుస్థితి.. ఓటమి భయం మొదలైందా..?

Chandrababu : ఏపీలో మూడు పార్టీలు ఇప్పుడు కీలకం. అందులో మొదటా చెప్పుకోవాల్సింది వైసీపీ, రెండోది టీడీపీ మూడోది జనసేన పార్టీ. జనసేన ప్రభావం పెద్దగా లేకపోయినా.. అంతో ఇంతో కొన్ని చోట్ల పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా టీడీపీ, వైసీపీ అధినేతలు జగన్, చంద్రబాబు మధ్యనే పోటీ ఉండబోతోంది. కాగా పార్టీ అధ్యక్షుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన బాధ్యత తన మీదనే ఉంటుంది. పార్టీని గెలిపించుకునే బాధ్యత మొత్తం ఆ పార్టీ అధ్యక్షుడి మీదనే ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక పార్టీల అధ్యక్షులు ఎక్కడి నుంచి అయితే పోటీ చేస్తారో ఆ నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.

కానీ అధినేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో సొంతంగా ప్రచారం చేసుకోరు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులివెందులలో ప్రచారం చేయలేదు. ఆయన రాష్ట్రమంతా తిరుగుతూ పార్టీ తరఫున ప్రచారం చేసుకున్నారు. కానీప్రచారం చేయకున్నా పులివెందులలో గెలుస్తూ వచ్చారు. అటు చంద్రబాబు కూడా కుప్పంలో ప్రచారం చేయకుండానే గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత జగన్ కూడా పులివెందులలో ప్రచారం చేయకుండానే గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో చూసుకుంటే పులివెందులలో జగన్ తరఫున ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకుంటూ వచ్చారు.

అటు కుప్పంలో కూడా గత ఎన్నికల్లో చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి ప్రచారం చేశారు. ఎందుకంటే పార్టీ అధినేత అంటే రాష్ట్రమంతటా తిరిగిపార్టీని గెలిపించాలి. సొంత నియోజకవర్గంలో తిరగకున్నా గెలవాలి. లేదంటే అవమానంగానే భావిస్తారు. అందుకే ఇన్ని రోజులు చంద్రబాబు కూడా అలాగే చేశారు. కానీ ఇప్పుడు కుప్పంలో పరిస్థితి మారిపోతోంది. ఎందుకంటే వైసీపీ గెలిచిన తర్వాత కుప్పంను జగన్ అభివృద్ధి చేశారని వైసీపీ చెబుతోంది. ఇందులో భాగంగానే కుప్పంను మున్సిపాలిటీగా మార్చడంతో పాటు పులివెందులతో సమానంగా నిధులు కేటాయించినట్టు చెబుతున్నారు.

దాంతో పాటు హంద్రీనీవా నది నీల్లు తీసుకొచ్చి కుప్పం ప్రజలకు అందించామని వైసీపీ చెబుతోంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని చెబుతున్నారు. ఈ భయమే ఇప్పుడు చంద్రబాబును కుప్పం వైపు నడిపిస్తోంది. గత మూడేండ్లుగా చంద్రబాబు కుప్పంకు ఎన్ని సార్లు వెళ్తున్నారో చూశాం.

గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ కుప్పానికి వెళ్లలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఓటమి భయంతోనే నామినేషన్లకు ముందే పలుమార్లు కుప్పం వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. తనకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం పట్టుకుందని వైసీపీ సెటైర్లు వేస్తోంది. జగన్ పులివెందులకు వెళ్లకుండానే గెలుస్తారని.. చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని కౌంటర్లు వేస్తున్నారు వైసీపీ నేతలు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News