Chandrababu : చంద్రబాబు భూ దందా.. 800 ఎకరాలకు టోకరా పెట్టేందుకు స్కెచ్..!

Qubetvnews - March 8, 2024 / 10:17 PM IST

Chandrababu : చంద్రబాబు భూ దందా.. 800 ఎకరాలకు టోకరా పెట్టేందుకు స్కెచ్..!

Chandrababu : చంద్రబాబు హయాంలో జరిగిన అనేక అవకతవకలు ఇప్పటికీ బయట పడుతున్నాయి. మొన్న 2014-18 వరకు మాత్రమే ఇవి బయట పడుతున్నాయి అనుకుంటే పొరపాటే.. అంతకు ముందు చంద్రబాబు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పెద్ద పెద్ద కుంభకోణాలు ఇప్పుడు బయటపడుతున్నాయని వైసీపీ సాక్ష్యాలతో సహా వివరిస్తోంది. ఇలాంటి దాంట్లోనే ఇప్పుడు చంద్రబాబు చేసిన దాంట్లో ఇప్పుడు మరో మచ్చు తునక కూడా బయటపడింది. అదేంటంటే.. చంద్రబాబు హయాంలో జరిగిన అతిపెద్ద భూ దందా అని బయట పడిపోయింది.

చంద్రబాబు 2003లో సీఎంగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లాలో ఏకంగా 800 ఎకరాలను కాజేసేందుకు పెద్ద స్కెచ్ వేసేశారంట. రూ.50వేల కోట్ల విలవ జేసే 800 ఎకరాల భూములను ఓ ఫేక్ కంపెనీకి ఇవ్వాలని చంద్రబాబు వేసిన ఎత్తుగడలు ఇప్పుడు హైకోర్టు సాక్షిగా బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా హైకోర్టు ఆ 800 ఎకరాలు ప్రభుత్వానివే అని తీర్పు ఇచ్చింది. దాంతో చంద్రబాబు డొల్లతనం బయటపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో 2003 లో ‘ఐఎంజీ భారత’కు ఎకరం రూ.50 వేల చొప్పున 800 ఎకరాలు కేటాయించారు చంద్రబాబు.

ఐఎంజీ భారత అనే కంపెనీని 2003 ఆగస్టు 5న రిజిస్టర్ చేయగా దానికి అధినేత అహోబలరావు అలియాస్ బిల్లీరావు. క్రీడా మైదానాలు కట్టి, 2020 ఒలింపిక్స్ కోసం క్రీడాకారులను సిద్ధం చేస్తామంటూ కంపెనీ ప్రచారం చేసి ప్రారంభించిన నాలుగు రోజులకే ఉమ్మడి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది ఈ కంపెనీ. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి కేటాయించింది.

ఆ సమయంలో అక్కడ సుమారు ఎకరం రూ. 10 కోట్లు ధర పలుకుతుండగా.. ఎకరం రూ.50 వేల వంతున కేటాయిస్తూ 2003 ఆగస్టు 9న చంద్రబాబు సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. కాగా ఆ భూముల కేటాయింపులను రద్దు చేస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది.

అనుభవం లేని ఫేక్ కంపెనీకి ఎలా భూములు కేటాయిస్తారంటూ చంద్రబాబును ప్రశ్నించింది. చంద్రబాబు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పటి వైఎస్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అప్పటి నుంచి ఈ కేసు స్టేటస్ కోలో ఉండిపోయింది. ఇంతకాలం వాదోపవాదనలు జరిగిన తర్వాత రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ భూముల కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.
2006 నుంచి నడుస్తున్న ఈ కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో రూ. వేల కోట్ల భూమి ప్రభుత్వ ఖాతాలో పడింది. ఇలా చంద్రబాబు మచ్చను మరోసారి బయటి ప్రపంచానికి చూపించింది ఈ భాగోతం.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News