Chandrababu rule Pawan kalyan : చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ.. జనసేన ఉన్నదే టీడీపీ కోసమా..?

Qubetvnews - February 26, 2024 / 11:39 AM IST

Chandrababu rule Pawan kalyan : చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ.. జనసేన ఉన్నదే టీడీపీ కోసమా..?

Chandrababu rule Pawan kalyan : అదేంటో గానీ.. అసలు జనసేన అనేది ఉన్నదే టీడీపీని అధికారంలోకి తేవడానికా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జనసేన చేస్తున్న పనులే దీనికి నిదర్శనం. పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టి పదేండ్లు అవుతోంది. ఇప్పటి వరకు ఆయన పనులు అన్నీ కూడా చంద్రబాబు కోసమే అన్నట్టు మారిపోతున్నాయి. పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టిన కొత్తలో అంటే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రావడం ఏపీకి అసవరం పెద్ద పెద్ద డైలాగులే పేల్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

దాంతో పవన్ కల్యాణ్‌ తన వల్లే చంద్రబాబు అధికారంలోకి వచ్చిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. మధ్యలో ఏమైందో తెలియదు గానీ.. 2019 ఎన్నికల సమయానికి వచ్చేసరికి మాత్రం చంద్రబాబును కాదని.. కమ్యూనిష్టులతో పొత్తులు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో దారుణమైన దెబ్బ పడింది. ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి మళ్లీ చంద్రబాబును అధికారంలోకి తేవడానికే పవన్ కల్యాణ్‌ అలా కమ్యూనిష్టులతో పోటీ చేశాడనే టాక్ కూడా నడిచింది. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పుడు మళ్లీ 2024 ఎన్నికల కోసం చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నారు పవన్ కల్యాణ్‌.

ఈ ఎన్నికల్లో కూడా జగన్ ను ఓడించడం కోసమే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలొద్దనే ఉద్దేశంతోనే చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుంటున్నట్టు తెలిపారు. ఇక గౌరవ ప్రదమైన సీట్లు, ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలంటూ పవన్ కల్యాణ్‌ ఎన్నో కండీషన్లు పెట్టామన్నారు. చివరకు అవన్నీ పాతాళంలోకి తొక్కేసినట్టు.. ముష్టి వేసినట్టు 118 సీట్లలో కేవలం 24 సీట్లు మాత్రమే ఇచ్చాడు చంద్రబాబు. దాంతో జనసైనికులు రగిలిపోతున్నారు. చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్‌ కీలుబొమ్మలా మారిపోయాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు.

అసలు చంద్రబాబు మాటలను ఒక్కసారి కూడా పవన్ కల్యాణ్‌ ఎదురించకపోవడాన్ని.. చంద్రబాబు ఏం చేసినా దాన్ని సమర్థించడాన్ని బట్టి చూస్తుంటే.. అసలు పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమా.. జనసేన ఉన్నదే టీడీపీని అధికారంలోకి తేవడం కోసమా అనే అనుమానాలు జనసైనికుల్లో అటు కాపు వర్గాల్లో వస్తున్నాయి.

జనసేనలో ఇంత అలజడి రేగుతున్నా సరే పవన్ మాత్రం దానిపై స్పందించట్లేదు. పైగా ఏమైనా అంటే పార్టీని వీడి వెళ్లిపోండి అంటూ ఆదేశాలు ఇచ్చినా ఇస్తాడేమో అంటున్నాయి జనసేన వర్గాలు. ఇలా ఎటు చూసుకున్నా పవన్ ను నమ్ముకుంటే భవిష్యత్ లేదని.. చంద్రబాబు కోసమే ఈ పార్టీ పెట్టుకున్నారేమో అనే అనుమానాలు వారిలో వస్తున్నాయి. మరివారు ఉంటారా పార్టీని వీడుతారా అనేది తొందర్లోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.

 

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News