Chandrababu : పెన్షనర్ల పాలిట చంద్రబాబు కర్కశం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..?

Qubetvnews - April 29, 2024 / 07:46 PM IST

Chandrababu : పెన్షనర్ల పాలిట చంద్రబాబు కర్కశం.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..?

Chandrababu : చంద్రబాబు నాయుడు తనకు ఏది అనుకూలంగా ఉంటే దానికి సైఅంటున్నారు. ఒకసారి ఒకటి చెప్పేసి దానితో డ్యామేజ్ వస్తుందని గ్రహించి దెబ్బకు మాట మార్చేస్తున్నాడు. ఇప్పుడు పెన్షనర్ల పాలిట కూడా ఇలాగే తయారయ్యాడు. వాస్తవానికి ఏపీలో 70 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారంతా కూడా జగన్ నియమించిన వాలంటీర్ల ద్వారా హాయిగా ఇంటి వద్దనే పెన్షన్లు తీసుకునేవారు. కానీ ఇలా ఇంటికెళ్లి పెన్షన్లు ఇస్తే ఎక్కడ తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని చంద్రబాబు గ్రహించారు. ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఇస్తే వారి గుండెల్లో జగన్ ఉంటాడని చంద్రబాబు కక్ష గట్టారని వైసీపీ ఆరోపిస్తోంది.

అందుకే చంద్రబాబు వెంటనే తన మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీని అడ్డుకునేందుకు ఫిర్యాదుచేయించారు. దాన్ని విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుంది. దాంతో ఎండలో వృద్ధులు, వికలాంగులు గ్రామ సచివాలయాలకు నానా అవస్థలుపడుకుంటూ వెళ్లి పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎండదెబ్బకు కొంతమంది వృద్ధులు ఇప్పటికే కన్నుమూశారు. ఆ పాపం అంతా చంద్రబాబుదే అని ఇప్పటికే వైసీపీ బలంగా ఆరోపణలు గుప్పిస్తోంది.

అయితే అటు ప్రజల నుంచి కూడా చంద్రబాబు మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పెన్షనర్లుకూడా చంద్రబాబును తిట్టుకోవడం స్టార్ట్ చేశారు. దాంతో ఎన్నికల్లో గట్టి దెబ్బ పడేలా ఉందని గ్రహించిన చంద్రబాబు వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ పెన్షన్లను గవర్నమెంట్ ఉద్యోగులతో ఇప్పించాలని కోరుతున్నారు. వృద్ధులు, వికలాంగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏదో పెన్షనర్లపై ప్రేమ ఉన్నట్టు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు చంద్రబాబు. కానీ చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు.

ఇప్పట్లో చంద్రబాబు మాటలను ఎవరూ నమ్మరని అందరికీ తెలుసు. అందుకే ఇప్పుడు చంద్రబాబు ఇలాంటి కొత్త డ్రామాలకు తెర తీస్తున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రజలు, అటు పెన్షనర్లు ఈ విషయాలను బాగానే గమనిస్తున్నారు. కాబట్టి వారంతా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News