Kadapa Court : ప్రతిపక్షాలకు షాక్.. వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కోర్టు…!

Qubetvnews - April 18, 2024 / 07:00 PM IST

Kadapa Court : ప్రతిపక్షాలకు షాక్.. వివేకా హత్యపై మాట్లాడొద్దన్న కోర్టు…!

Kadapa Court : ప్రతిపక్ష కూటమి నేతలకు షాక్ తగిలింది. ఇన్ని రోజులు వైఎస్ వివేకానంద హత్యను ఎన్నికల ప్రచారంలో వాడుకుని లబ్ది పొందాలని ప్లాన్ చేసిన వారికి ఇప్పుడు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసుపై పదే పదే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లోకేష్ లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వివేకా కూతురు సునీత, వైఎస్ షర్మిల కూడా వివేకా హత్యనే ప్రధాన ఎజెండాగా చేసుకుని కడపలో ప్రచారం చేస్తున్నారు.

పదే పదే జగన్ ను, అవినాష్ రెడ్డిని ఈ విషయంలో ఆరోపిస్తూ వారు విమర్శలు చేస్తున్నారు. కాగా ఇదే అంశంపై కడప కోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. కోర్టు వీరందరికీ షాక్ ఇచ్చింది. ఇక మీదట ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు గురించి మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్‌, షర్మిల, సునీత, పురంధేశ్వరిలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాట్లాడితే చర్యలు ఉంటాయని తెలిపింది. దాంతో ఇప్పుడు ప్రతిపక్షాలు బేజారు అయిపోతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ హత్య కేసును పెద్ద ప్రచార అస్త్రంగా వాళ్లు వాడుకున్నారు. కానీ ఇప్పుడు కోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో వారికి ఇది పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News