Ysrcp : క్రాస్ ఓటింగ్.. వైసీపీకే అధికారం కట్టబెట్టనుందా..?
Qubetvnews - May 18, 2024 / 10:03 AM IST
Ysrcp : జమిలి ఎన్నికలు జరిగినప్పుడల్లా కొంత క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు అటు కేంద్రంలోని పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడూ ఒకేసారి జరుగుతున్నాయి. దాంతో అప్పటి నుంచి ఏపీ ప్రజలు కాస్త క్రాస్ ఓటింగ్ కు అలవాటు పడ్డారు. అంటే ఎంపీ సీటుకు ఒక పార్టీకి వేస్తే ఎమ్మెల్యే సీటుకు మరో పార్టీకి వేయాలని వారు భావిస్తున్నారు ప్రజలు. అంటే అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వారు ఇలా చేస్తున్నారన్నమాట. అందుకే క్రాస్ ఓటింగ్ అనేది ఎప్పుడు ఎవరికి లాభం చేస్తుందో.. ఎవరికి నష్టం చేస్తుందో చెప్పడం మాత్రం కష్టమే.
అయితే ఏపీలో ఇప్పుడు గతంతో పోలిస్తే రెండు శాతం ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ ఎక్కువ పోలింగ్ అనేది ఇప్పుడు క్రాస్ ఓటింగ్ లో భాగమే అంటున్నారు. వాస్తవానికి ఈ పెరిగిన పోలింగ్ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని వారిదే ఉంది. వారు ఎక్కువ పోలింగ్ వేసినట్టు తెలుస్తోంది. అర్బన్ ఏరియాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా ఓట్లేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. అందులోనూ మహిళలు, పిన్షన్ దారులు, రైతులే ఎక్కువగా పోలింగ్ బూత్ ల వద్ద కనిపించారు. అయితే వీరంతా గత ఐదేండ్లుగా జగన్ పాలనలో ఎక్కువగా లబ్ది పొందిన వారే.
కాబట్టి వీరంతా కచ్చితంగా జగన్ కే ఓట్లేశారని అంటున్నారు. జగన్ తమకు మంచి చేశాడు కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే వారంతా ఓట్లేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రజలకు అటు టీడీపీ కూటమి బాగానే డబ్బులు పంచింది. అందుకే ఇక్కడే ప్రజలు న్యాయం ఆలోచించారు. ఒక ఓటు ఒకరికి వేస్తే ఇంకో ఓటు ఇంకొకరికి వేయాలని వారు భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఎంపీకి ఒక పార్టీకి ఓటేస్తే ఎమ్మెల్యేకు మరో పార్టీకి ఓటేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో జగన్ సీఎం కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేకు కచ్చితంగా వైసీపీకే వేశారని అంటున్నారు.
కొన్ని చోట్ల బీజేపీని చూసి ఎంపీ సీటుకు ఓటేస్తే.. ఎమ్మెల్యేకు మాత్రం జగన్ పార్టీకే జై కొట్టారు. అంటే టీడీపీ కూటమి కూడా డబ్బులు పంచింది కాబట్టి ఆ పార్టీకి ఓటేయాలని ప్రజలు కొందరు భావించారు. అప్పుడే జగన్ ఉండాలనుకుని స్టేట్ జగన్ కు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కూటమికి కొన్ని చోట్ల ఇలా క్రాస్ ఓటింగ్ వేశారు.
కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ కచ్చితంగా జగన్ ను గెలిపిస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు. అందుకే గతంతో పోలిస్తే ఈ సారి ఎంపీ సీట్లు కొంచెం తక్కువగానే వస్తాయని అంటున్నారు. అదే ఎమ్మెల్యే సీట్లు మాత్రం కచ్చితంగా గతం కన్నా మెరుగ్గానే వస్తాయని చెబుతున్నారు వైసీపీ నేతలు.